టీమిండియా ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నానని తెలిపాడు. అయితే ఫ్రాంచైజి క్రికెట్, దేశవాళీ మ్యాచ్‌ల్లో అతడు ఆడే అవకాశముంది.
35 ఏళ్ల పఠాన్ 2019, ఫిబ్రవరిలో చివరి సారిగా జమ్ము కశ్మీర్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడాడు. గాయం కారణంగా ఆ తర్వాత మైదానంలో అడుగుపెట్టలేదు. 2020 ఐపీఎల్ వేలానికీ తన పేరు నమోదు చేసుకోలేదు.
ఇర్ఫాన్ పఠాన్ అనగానే గుర్తుకువచ్చేది. 2006లో పాకిస్థాన్‌పై హ్యాట్రిక్ వికెట్లు. మొదటి ఓవర్లోనే వరుసగా మూడు వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా పఠాన్ రికార్డు సృష్టించాడు. స్మలాన్ భట్, యూనిస్ ఖాన్, మహ్మద్ యూసఫ్ వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపించాడు. ఇర్ఫాన్ లాంటి బౌలర్లు పాక్‌లో గల్లీ గల్లీకి ఉంటారని విర్రవీగిన వారికి గట్టిగా బుద్ధి చెప్పాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2003లో తొలి టెస్టు ఆడిన ఇర్ఫాన్ పఠాన్ ఆనతి కాలంలోనే టీమిండియా స్టార్ బౌలర్‌గా ఎదిగాడు. 29 టెస్టుల్లో 1105 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఏడు అర్ధసెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా 100 వికెట్లు తీశాడు. 2008లో దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు పఠాన్.
20 వన్డేల్లో 173 వికెట్లు తీసిన పఠాన్.. 1544 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధశతకాలు ఉన్నాయి. 2012 ఆగస్టులో శ్రీలంకపై చివరి వన్డే ఆడాడు ఇర్ఫాన్.
24 అంతర్జాతీయ టీ20ల్లో 28 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు పఠాన్. 172 పరుగులు చేశాడు. 2012 అక్టోబరులో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. 103 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1139 పరుగులతో పాటు 80 వికెట్లు తీశాడు. చివరగా ఐపీఎల్లో 2017లో గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు.
ఇదీ చదవండి: '4 రోజుల మ్యాచ్‌ల వల్ల టెస్టు పవిత్రత దెబ్బతింటుంది'