ఐర్లాండ్ క్రికెటర్ కెవిన్ ఓబ్రియాన్ బ్యాటింగ్ ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తొలిసారి తన బ్యాటింగ్ పరాక్రమానికి చింతించాడు ఈ స్టార్ ప్లేయర్. ఇటీవలే జరిగిన ఓ మ్యాచ్‌లో అద్భుతమైన సిక్సర్‌ను కొట్టగా.. బంతి నేరుగా వెళ్లి అతని కారు అద్దాన్ని పగలగొట్టింది. ఈ మ్యాచ్‌లో ఎనిమిది సార్లు బంతిని సిక్సర్‌తో బౌండరీ దాటించగా.. అందులో ఒకటి పార్కింగ్‌లో ఉంచిన తన కారును తాకింది. మ్యాచ్ ముగిసిన అనంతరం.. అద్దాన్ని మార్చేందుకు కారును నేరుగా గ్యారేజీకి తీసుకెళ్లాడు ఓబ్రియాన్. ఇకపై మరింత దూరంలో కారును పార్క్ చేస్తానని ట్వీట్ చేశాడు.
-
Good ending. 😂 https://t.co/kcrAXqPOJI
— Cricket Ireland (@Irelandcricket) August 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Good ending. 😂 https://t.co/kcrAXqPOJI
— Cricket Ireland (@Irelandcricket) August 27, 2020Good ending. 😂 https://t.co/kcrAXqPOJI
— Cricket Ireland (@Irelandcricket) August 27, 2020
లీన్‌స్టర్ లైట్నింగ్, నార్త్ వెస్ట్ వారియర్స్ జట్ల మధ్య గురువారం ఓ టీ20 మ్యాచ్ జరిగింది. అయితే, వరుణుడు అంతరాయం కలిగించడం వల్ల మ్యాచ్‌ను చెరో 12 ఓవర్ల పాటే ఆడించారు. ఈ సందర్భంగా తొలుత బ్యాటింగ్ చేసిన లీన్‌స్టర్ నిర్ణీత ఓవర్లలో 124/4 భారీ స్కోర్ చేసింది. కెవిన్ ఓబ్రియాన్(82; 37 బంతుల్లో 8x6) తన బ్యాటింగ్‌తో నల్లమబ్బుల్లోనూ చుక్కలు చూపించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్త్ వెస్ట్ వారియర్స్ 12 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 104 పరుగులే చేసింది. పోర్టర్‌ఫీల్డ్(50) అర్ధశతకంతో రాణించినా అతడికి సహకరించే బ్యాట్స్‌మన్ లేక ఆ జట్టు 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
-
📸: KEVIN O’BRIEN SMASHES SIX...
— Cricket Ireland (@Irelandcricket) August 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
...and his own car window. Seriously.#IP2020 | @TestTriangle ☘️🏏 pic.twitter.com/dKbfDRHrjY
">📸: KEVIN O’BRIEN SMASHES SIX...
— Cricket Ireland (@Irelandcricket) August 27, 2020
...and his own car window. Seriously.#IP2020 | @TestTriangle ☘️🏏 pic.twitter.com/dKbfDRHrjY📸: KEVIN O’BRIEN SMASHES SIX...
— Cricket Ireland (@Irelandcricket) August 27, 2020
...and his own car window. Seriously.#IP2020 | @TestTriangle ☘️🏏 pic.twitter.com/dKbfDRHrjY