ఈ ఏడాది జులై 30 నుంచి ఇంగ్లాండ్‌తో ఆడబోయే మూడు మ్యాచుల వన్డే సిరీస్‌పై ఆందోళన వ్యక్తం చేసింది ఐర్లాండ్ జట్టు. అగియాస్ బౌల్ స్టేడియంలో ఈ మ్యాచులు జరగడం వల్ల ఆటగాళ్లు ఇబ్బంది పడతారని తెలిపాడు ఐర్లాండ్ జట్టు హెడ్ కోచ్ గ్రహమ్ ఫోర్డ్. ఈ మైదానంలో క్రీమ్ రంగు సీట్లు ఉండటమే కారణమని తెలిపాడు.
మ్యాచులో తెల్లరంగు బంతితో ఆడేటప్పుడు.. సీట్ల రంగు కూడా తెల్లగా ఉండటం చేత ఫీల్డర్లకు సవాల్‌గా మారుతుందని అన్నాడు. బంతి గాల్లోకి ఎగిరినప్పుడు సీట్లరంగు కాంతి దానిపై పడి కనపడటం కష్టంగా ఉంటుందని వెల్లడించాడు. కాబట్టి స్టేడియంలో మార్పులు చేయాల్సిందిగా ఇంగ్లాండ్ బోర్డుకు విజ్ఞప్తి చేశాడు.
ఇప్పటికే తమ జట్టు ఆటగాళ్లు ఈ కారణం చేత ప్రాక్టీసు చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నారని తెలిపాడు ఫోర్ట్. జులై 30, ఆగస్టు 1, 4వ తేదీలలో ఐరిశ్-ఇంగ్లీష్ జట్ట మధ్య బయోసెక్యూర్ వాతావరణంలో ఈ మ్యాచులు జరగనున్నాయి.
ఇది చూడండి : ధోనీ విఫలమైతే మాత్రం కష్టమే: జోన్స్