ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై ప్రశంసలు కురిపించాడు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర. ఈ టోర్నీకి చాలా ప్రాముఖ్యం ఉందని, దీని వల్ల ఎంతోమంది జీవనోపాధి పొందుతున్నారని చెప్పాడు. యుఏఈలో లీగ్ నిర్వహణ వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డాడు.
"క్రీడలు దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటంలో ప్రధాన భాగమవుతాయి. ఐపీఎల్‌తో ఆర్థిక ప్రయోజనం కోసమే కాకుండా, అభిమానులకు మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది. టీవీలో మ్యాచ్‌లను చూడటం ద్వారా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయనే భావన కలుగుతుంది. అయితే ప్రస్తుతం పూర్తి భిన్నంగా ఉంది. విదేశీ ప్రయాణాలతో బీసీసీఐ అనేక సవాళ్లను ఎదుర్కోనుంది. బయో సెక్యూర్ వాతావరణంలో మ్యాచ్‌లను నిర్వహించడం వల్ల టీవీల్లో చూసి యువతపై సానుకూల ప్రభావం పడనుంది. ఐపీఎల్ వల్ల ఆటగాళ్లు, సర్వీసు ప్రొవైడర్లు, ప్రసారదారులే కాకుండా మరెంతో మందికి జీవనోపాధి లభిస్తుంది"
- కుమార సంగక్కర, శ్రీలంక మాజీ కెప్టెన్
యుఏఈలో ఐపీఎల్‌ను నిర్వహించడం వల్ల ఆ దేశానికి ఆదాయం రావడం సహా అక్కడున్న అనేక మందికి పరోక్షంగా పని దొరుకుతుందని సంగక్కర అభిప్రాయపడ్డాడు.
భారత దేశంలో కరోనా కేసులు క్రమంగా అరబ్ దేశంలో సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్ జరపనున్నట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడటం వల్ల ఈ టోర్నీ నిర్వహణకు మార్గం సుగమమైంది. అంతకుముందు 2009, 2014లోనూ ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించారు.