ETV Bharat / sports

ఐపీఎల్లో టాప్​ - 5 పరుగుల రారాజులు వీరే..! - kohli

ఐపీఎల్​లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన మొదటి ఐదుగురి జాబితాలో రైనా మొదటి స్థానంలో నిలిచాడు. కోహ్లి, రోహిత్​, గంభీర్​ వరుసగా తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఐదో స్థానంలో ఊతప్ప కొనసాగుతున్నాడు. టాప్​-5లో విదేశీ ఆటగాళ్లెవరూ లేకపోవడం గమనార్హం.

రైనా,కోహ్లీ, రోహిత్
author img

By

Published : Mar 21, 2019, 8:32 PM IST

రెండు రోజుల్లో ఐపీఎల్ 12వ సీజన్ మొదలవనుంది. ఒకవైపు వేసని తాపానికి రోజంతా డీలా పడిన సమయంలో పొట్టి క్రికెట్​తో కాస్తంత ఊరట లభించనుంది. రోహిత్ మెరుపులు, కోహ్లీ అరుపులు, ధోని వ్యూహాలతో మైదానాలు సందడిగా మారనున్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రీమియర్ లీగ్​లన్నింటిలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్​మన్లపై ఓ సారి లుక్కేద్దాం.

సురేష్ రైనా
ఒకప్పుడు టీమిండియా మిడిల్​ ఆర్డర్​లో ధనాధన్​ బ్యాటింగ్​తో అదరగొట్టాడు రైనా. ప్రస్తుతం ఫామ్​ కోల్పోయాడు. తిరిగి తుది జట్టులో స్థానం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. ప్రతి ఐపీఎల్​లోనూ అద్భుత ప్రదర్శన చేసే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్​మెన్​ మొత్తం ఐపీఎల్​​లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో మొదటి స్థానంలో ఉన్నాడు. 176 మ్యాచ్​లు ఆడి 172 ఇన్నింగ్స్​ల్లో 34.37 సగటుతో 4,985 పరుగులు చేశాడు. ఐదు వేల పరుగులు సాధించిన మొదటి క్రికెటర్​గా నిలవడానికి ఇంకా 15 పరుగుల దూరంలో ఉన్నాడీ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు.

ipl top run getters
సురేష్ రైనా

విరాట్ కోహ్లీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారథ్యం వహిస్తోన్న కోహ్లీ.. జట్టుకు కప్పు తీసుకురావడంలో మాత్రం విఫలమవుతున్నాడు. బ్యాట్స్​మెన్​గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నా ఛాలెంజర్స్​ను విజయతీరాలకు చేర్చలేకపోతున్నాడు. ఐపీఎల్​లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న కోహ్లీ మొదటి స్థానంలో ఉన్న రైనాకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటివరకు 163 మ్యాచ్​లు ఆడి 155 ఇన్నింగ్స్​ల్లో 38.35 సగటుతో 4,948 పరుగులు సాధించాడు విరాట్.

ipl top run getters
విరాట్ కోహ్లీ

రోహిత్ శర్మ
ముంబయి ఇండియన్స్​కు సారథ్యం వహిస్తోన్న రోహిత్ ఐపీఎల్​లో జట్టును విజయ పథాన నడిపించాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్​గా రికార్డు సృష్టించిన హిట్​మ్యాన్ పొట్టి ఫార్మాట్లోనూ తనదైన హిట్టింగ్​తో ఆకట్టుకోగల సమర్థుడు. మొత్తం 173 మ్యచ్​లు ఆడి 168 ఇన్నింగ్స్​ల్లో 4,493 పరుగులు సాధించి మూడో స్థానంలో ఉన్నాడు.

ipl top run getters
రోహిత్ శర్మ

గౌతం గంభీర్
2011 భారత ప్రపంచకప్ గెలుపులో కీలకపాత్ర పోషించిన గంభీర్ అనంతరం జట్టులో స్థానం సంపాదించ లేకపోయాడు. గత కొన్నేళ్లుగా దేశవాళీ, ఐపీఎల్​లో మాత్రమే ఆడుతోన్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్​మెన్ కోల్​కతాకు రెండు సార్లు ట్రోఫీ అందించాడు. ఐపీఎల్​లో 154 మ్యాచ్​ల్లో 152 ఇన్నింగ్స్​ల్లో 4,217 పరుగులు సాధించాడు.

ipl top run getters
గౌతం గంభీర్

రాబిన్ ఊతప్ప
టీమిండియాలో చోటు కోల్పోయినా ఐపీఎల్​లో మాత్రం అదరగొడుతుంటాడు ఊతప్ప. కోల్​కతా రెండు సార్లు ట్రోఫీ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం ఇప్పటివరకు 165 మ్యాచ్​లు ఆడిన ఊతప్ప 158 ఇన్నింగ్స్​ల్లో 4,086 పరుగులు సాధించి ఐదో స్థానంలో ఉన్నాడు.

ipl top run getters
రాబిన్ ఊతప్ప

5000 పరుగుల క్లబ్బులో...
ఐపీఎల్​లో ఐదు వేల పరుగులు సాధించిన ఆటగాడిగా నిలవడానికి ఇంకా 15 పరుగుల దూరంలో ఉన్నాడు సురేష్ రైనా. కోహ్లీ కూడా 4,948 పరుగులతో ఈ క్లబ్బులో చేరేందుకు ఎదురుచూస్తున్నాడు. మరో బ్యాట్స్​మెన్ రోహిత్ కూడా ఈ సీజన్​లో ఐదు వేల పరుగులు సాధించడానికి అవకాశం ఉంది.

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Thursday, 21 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1153: UK Shazam Premiere Content has significant restrictions, see script for details 4202019
'Shazam!' stars talk superheroes vs. trolls
AP-APTN-1030: ARCHIVE Lollapalooza Content has significant restrictions, see script for details 4202015
Ariana Grande, Childish Gambino to headline Lollapalooza
AP-APTN-0318: South Korea Singer AP Clients Only 4201987
K-pop star apologizes for 'unforgivable crime'
AP-APTN-0058: ARCHIVE Felicity Huffman AP Clients Only 4201979
Felicity Huffman's court date pushed back in admissions scam case
AP-APTN-2148: Pakistan Pak Arts Festival AP Clients Only 4201963
Renowned play ‘Jinnay Lahore Nahin Vekhya’ was performed at NAPA, International Performing Art Festival
AP-APTN-2102: ARCHIVE R. Kelly AP Clients Only 4201968
R. Kelly asks judge to let him travel to Dubai to perform
AP-APTN-2056: ARCHIVE Jessica Simpson AP Clients Only 4201967
Jessica Simpson and husband Eric Johnson welcome daughter
AP-APTN-1657: US Bill and Ted announcement AP Clients Only 4201907
Party on, dudes! Keanu Reeves and Alex Winter announce new 'Bill and Ted' adventure
AP-APTN-1651: Australia Koala Must credit content creator 4201911
Koala cools off in air-conditioned car near Adelaide
AP-APTN-1649: Pakistan Czech Model AP Clients Only 4201910
Czech model jailed in Pakistan for drug trafficking
AP-APTN-1642: UK Duke of Sussex AP Clients Only 4201899
The Duke of Sussex meets a dog and plants a tree at London primary school
AP-APTN-1423: UK Indian Fugitive Content has significant restrictions, see script for details 4201878
Indian fugitive Nirav Modi arrested in London
AP-APTN-1415: UK CE White Crow Content has significant restrictions, see script for details 4201875
David Hare keeps rejecting 'Strictly Dancing' offers
AP-APTN-1405: US Once Upon a Time in Hollywood trailer Content has significant restrictions, see script for details 4201869
First trailer for Pitt and DiCaprio's Tarantino movie released
AP-APTN-1307: ARCHIVE Disney Fox AP Clients Only 4201862
Disney closes $71B deal for Fox entertainment assets
AP-APTN-1240: US Us premiere Content has significant restrictions, see script for details 4201856
Jordan Peele wants 'Us' audiences to 'shout at the screen'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.