ETV Bharat / sports

ఐపీఎల్ 2020​: దుబాయ్​లో ధోనీ అక్కడ.. కోహ్లీ ఇక్కడ! - ipl special story on crickers stay hotels

క్రికెట్​ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్​-2020 సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ దుబాయ్​ చేరుకున్నాయి. అయితే ఆటగాళ్లంతా ఎక్కడుంటున్నారు..? వారికి వసతి ఏర్పాటు చేసిన రిసార్టుల ప్రత్యేకతలు ఏంటి? ఓసారి తెలుసుకుందాం రండి.

IPL TEAMS
ఐపీఎల్​
author img

By

Published : Aug 25, 2020, 12:03 PM IST

ఐపీఎల్​కు ఇంకా 25 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే లీగ్​ జరుగబోతున్న యూఏఈకి జట్లన్నీ చేరుకున్నాయి. హోటళ్లలో బస కూడా ఏర్పాటైంది. సాధారణంగా ఆటగాళ్ల వసతి గురించి ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ ఈసారి లీగ్​ పూర్తిగా యూఏఈలోనే నిర్వహించనున్నారు. రెండు నెలలకు పైగా ఆటగాళ్లు ఆ దేశంలోనే ఉండనున్నారు.

కరోనా ముప్పు నేపథ్యంలో వారంతా బయో'బుడగ'కు పరిమితం కానున్నారు. మరి సుదీర్ఘ సమయం హోటళ్లకు పరిమితం కానున్న వారికి.. ఎలాంటి వసతి ఏర్పాటు చేశారు.? ఏ జట్టు ఆటగాళ్లు ఎక్కడ ఉండబోతున్నారు..? వంటి విశేషాలను తెలుసుకుందాం రండి.

IPL TEAMS
ముంబయి ఇండియన్స్​

ముంబయి ఇండియన్స్​

రోహిత్​ శర్మ నేతృత్వంలోని డిఫెండింగ్​ ఛాంపియన్స్​ ముంబయి ఇండియన్స్​ జట్టు.. అబుదాబిలోని 'సెయింట్​ రేజిస్​ సాదియత్​' ఐలాండ్ రిసార్ట్​లో బస చేస్తోంది. ఈ హోటల్​కు అనుసంధానంగా బీచ్​కుడా ఉంది. దుబాయ్​లోని అతిపెద్ద రిసార్ట్​ల్లో ఇదీ ఒకటి. ముంబయి జట్టు స్పాన్సర్లలో ఒకటైన మారియట్​ గ్రూప్​కు చెందినదే ఈ రిసార్ట్​ కావడం విశేషం.

IPL TEAMS
కోల్​కతా నైట్​రైడర్స్​

కోల్​కతా నైట్​రైడర్స్​

కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టుకు దుబాయ్​లోని 'ది రిట్జ్​ కార్టన్'​ హోటల్​లో వసతి కల్పించారు. 'గ్రాండ్​ కెనాల్'​ అని కూడా పిలిచే ఈ హోటల్​ను 57 ఏకరాల విస్తీర్ణంలో నిర్మించారు. భారీ ఉద్యానవనం, ఈతకొలను, ప్రైవేటు బీచ్​ ఉన్న రిసార్ట్ ఇది. నైట్​రైడర్స్​ యజమాని షారుఖ్​ ఖాన్​కు ఈ హోటల్​తో అనుబంధం ఉంది. రిసార్ట్​లో సగం గదులను జట్టు కోసం బుక్​ చేసినట్లు సమాచారం.

IPL TEAMS
రాయర్​ ఛాలెంజర్స్ బెంగళూరు

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు

విరాట్​ కోహ్లీ జట్టు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు.. పామ్​ జుమేరా ప్రాంతంలోని వాల్డర్ఫ్​ అస్టోరియా హోటల్​లో బస చేస్తోంది. దుబాయ్​లో అత్యంత ఖరీదైన హోటల్​లో ఇదొకటి. ఇందులోని గదుల నుంచి సముద్రం కనిపిస్తుంది. ప్రైవేటు బీచ్​ అందుబాటులో ఉన్న ఈ రిసార్ట్​లో ఆరు భారీ రెస్టారెంట్లు, లాంజ్​లు ఉన్నాయి.

IPL TEAMS
చెన్నై సూపర్​ కింగ్స్​

చెన్నై సూపర్​కింగ్స్​

దుబాయ్​కి తలమానికమైన బుర్జ్​ ఖలీఫాకు పక్కనే ఉన్న తాజ్​ దుబాయ్​ హోటల్​లో మహేంద్ర సింగ్​ ధోనీ సైన్యం.. మూడు సార్లు ఐపీఎల్​ ట్రోఫీ సొంతం చేసుకున్న సీఎస్కే బస చేస్తోంది. తమ ఆటగాళ్లు, సిబ్బంది కోసం ఫ్రాంచైజీ యాజమాన్యం ఈ హోటల్​లో ఒక ఫ్లోర్​ మొత్తం బుక్​ చేసుకుంది.

IPL TEAMS
సన్​రైజర్స్ హైదరాబాద్​

సన్​రైజర్స్​ హైదరాబాద్​

ఐపీఎల్​ మాజీ ఛాంపియన్​ సన్​రైజర్స్​ హైదరాబాద్​ దుబాయ్​లో సముద్రాన్ని ఆనుకుని ఉన్న 'రిట్జ్​ కార్ల్​టన్'​ హోటల్​లో ఉంటోంది. ఇందులో గదులన్నీ సముద్ర అందాలు కనిపించేలా ఉంటాయి. సన్​రైజర్స్​ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ఓ క్లబ్​ లాంజ్​ను కేటాయించినట్లు సమాచారం.

కింగ్స్ ఎలెవెన్​ పంజాబ్​

ఈ జట్టుకు దుబాయ్​లోని 'సోఫిటెల్​ ది పామ్​' హోటల్​లో బస ఏర్పాటు చేశారు. విలాసవంతమైన హోటళ్లకు పెట్టిది పేరైన పామ్​ జుమేరా ప్రాంతంలో బెంగళూరు జట్టు ఉంటున్న వాల్డర్ఫ్​ అస్టోరియా హోటల్​కు అర కిలోమీటరు దూరంలో ఈ హోటల్​ ఉంటుంది. కళ్లు చెదిరే ఈతకొలను ఈ హోటల్​ ప్రత్యేకం.

దిల్లీ క్యాపిటల్స్​

దుబాయ్​లోని 'ప్యాలెస్​ డౌన్​టౌన్'​లో దిల్లీ జట్టు బస చేస్తోంది. ఇది బుర్జ్​ ఖలీఫాకు సమీపంలోనే ఉంది. ప్రఖ్యాత దుబాయ్​ ఫౌంటైన్​ అందాలు ఈ హోటల్​ నుంచి వీక్షించొచ్చు. చెన్నై జట్టు ఉంటున్న హోటల్​ దీనికి దగ్గరే.

IPL TEAMS
రాజస్థాన్​ రాయల్స్​

రాజస్థాన్​ రాయల్స్​

ప్రైవేటు బీచ్​, పామ్​ ఐలాండ్​ మధ్య ప్రశాంతంగా ఉండే వన్​ అండ్​ ఓన్లీ 'ది పామ్​ రెస్టారెంట్'​లో గులాబీ జట్టు రాజస్థాన్​ రాయల్స్​కు వసతి ఏర్పాటు చేశారు. ఇదీ దుబాయ్​లోనే ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.