ETV Bharat / sports

'ఐపీఎల్​లో చైనా స్పాన్సర్లకు ముగింపు పలుకుదాం' - నెస్​వాడియా తాజా వార్తలు

ఐపీఎల్​లో చైనా స్పాన్సర్​షిప్​లతో సంబంధాలు తెంచుకోవాలని కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్​ సహ యజమాని నెస్​వాడియా పిలుపునిచ్చారు. ఈ సీజన్​లో కుదరకపోతే, 2021 నాటికైనా వాటికి ముంగింపు పలకాలని ఉద్ఘాటించారు.

IPL should never ties with Chinese sponsors, if not this season, then by 2021: Ness Wadia
నెస్​వాడియా
author img

By

Published : Jun 30, 2020, 8:51 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​)లో చైనా స్పాన్సర్​షిప్​లకు ముంగిపు పలకాలని కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ సహ యజమాని నెస్​వాడియా పిలుపునిచ్చారు. ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"దేశం కోసం మనం ఈ పని చేయాలి. ఎప్పుడైనా దేశం ముందు.. తర్వాతే డబ్బు. అంతే కాకుండా ఇది ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​, చైనా ప్రీమియర్​ లీగ్​​ కాదు. మొదట్లో స్పాన్సర్​లను కనుగొనడం కష్టమే. కానీ మన దేశంలోనే కావాల్సినంత మంది స్పాన్సర్​లు ఉన్నారని నేను కచ్చితంగా చెప్పగలను. మన దేశం ప్రభుత్వం పట్ల గౌరవంగా వ్యవహించాలి. మనకోసం తమ ప్రాణాలను పనంగా పెట్టిన సైనికులకు మనం అర్పించే నివాళి అదే."

-నెస్​వాడియా, కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ సహ యజమాని

నెస్​వాడియా తన అభిప్రాయాలను వెల్లడించిన అనంతరం.. చెన్నైసూపర్​కింగ్స్​ సహా ఇతర జట్లు స్పందిస్తూ.. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాము మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు.

IPL should never ties with Chinese sponsors, if not this season, then by 2021: Ness Wadia
నెస్​వాడియా

అసలేం జరిగింది?

జూన్​15న గల్వాన్​ లోయ వద్ద ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన భారతీయులు.. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని సామాజిక మాద్యమాలు వేదికగా పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు.

ఈ క్రమంలోనే చైనా స్పాన్సర్​షిప్​లపై సమీక్షించాలని.. ఐపీఎల్​ పాలకమండలి సమావేశానికి బీసీసీఐ పిలుపునిచ్చింది. అయితే ఈ సమావేశం ఇంకా జరగలేదు. మరోవైపు సోమవారం చైనాకు సంబంధించిన టిక్​టాక్​ సహా 59 యాప్​లను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి...హిట్​మ్యాన్​ అరంగేట్రానికి 13 ఏళ్లు ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.