ETV Bharat / sports

చెన్నైX ముంబయి తొలి మ్యాచ్.. పైచేయి ఎవరిది? - latest CSK news updates

మరికొన్ని గంటల్లో ఐపీఎల్​ ప్రారంభం కానుంది. చెన్నై సూపర్​ కింగ్స్​, ముంబయి ఇండియన్స్​ హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​ల్లో ఎవరు పైచేయి సాధిస్తూ వచ్చారు? వారి బలాలు, బలహీనతలేంటి?

IPL
ఐపీఎల్
author img

By

Published : Sep 18, 2020, 7:06 PM IST

ఐపీఎల్​కు సర్వం సిద్ధమైంది. చెన్నై సూపర్​ కింగ్స్​, ముంబయి ఇండియన్స్ మధ్య శనివారం జరిగే మ్యాచ్​తో ఈ సీజన్​ ప్రారంభం కానుంది. గత ఆరు నెలల నుంచి ఎలాంటి క్రికెట్​ లేకపోవడం వల్ల అటు అభిమానులు, ఇటు ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. గతేడాది​ ఫైనల్​​లో ఈ రెండు జట్లు నువ్వా నేనా అన్నంతగా తలపడ్డాయి. ఒక్క పరుగు తేడాతో ముంబయి ట్రోఫీ సొంతం చేసుకుంది. దీంతో ఈ మ్యాచ్​లో చెన్నై ప్రతీకారం తీర్చుకుంటుందా? రోహిత్ సేన విజయాల పరంపర కొనసాగిస్తుందా? అనేది చూడాలి.

IPL
రోహిత్​, ధోనీ

ఎవరిది పైచేయి?

ఇతర జట్లతో కంటే ముంబయితోనే ఎక్కువ మ్యాచ్​లు ఆడింది చెన్నై. ఇప్పటి వరకు ఇరుజట్లు 28 మ్యాచ్​లు ఆడగా.. అందులో సీఎస్కే 11 సార్లు, ముంబయి 17సార్లు గెలిచింది. మిగిలిన జట్లపై 50 శాతం విజయాలతో ఉన్న ధోనీసేన.. ముంబయి ఇండియన్స్​పై మాత్రం ఆస్థాయి ప్రదర్శన చేయలేకపోయింది.

IPL
సీఎస్కే

చెన్నై బలాలు, బలహీనలు

అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచిన ధోనీ.. ఈ ఐపీఎల్​తో తిరిగి మైదానంలో తిరిగి అడుగుపెట్టనున్నాడు. దీంతో టోర్నీ మరింత రసవత్తరంగా సాగనుందని అందరూ భావిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో రైనా, హర్భజన్​ సింగ్​ లీగ్​ నుంచి తప్పుకున్నారు. ఫలితంగా చెన్నై జట్టుకు గట్టి ఎదురుదెబ్బ. దీంతో రైనా స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది పెద్ద ప్రశ్న. అత్యుత్తమ బౌలర్లతో పాటు, అనుభవజ్ఞులైన బ్యాట్స్​మెన్ ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం.

IPL
ముంబయి ఇండియన్స్​

ముంబయి పరిస్థితి ఏంటి?

టాప్​ ఆర్డర్, ఆల్​రౌండర్ల​ పరంగా ముంబయి జట్టు చాలా బలంగా తయారైంది. మరోవైపు రోహిత్​ శర్మ, బుమ్రా, హార్దిక్​ పాండ్య లాంటి భారత స్టార్ ఆటగాళ్లు ఉండటం, భారత పిచ్​లపై సత్తాచాటే స్పిన్నర్లు జట్టులో ఉన్నప్పటికీ యూఏఈ వాతావరణ పరిస్థితుల మధ్య ఎలా ఆడతారనేది ప్రశ్న.

జట్లు(అంచనా)

చెన్నై సూపర్​ కింగ్స్​

​ధోనీ, దీపక్​ చాహర్, కేదార్​ జాదవ్​, రవీంద్ర జడేజా,పియూష్ చావ్లా, డ్వేన్​ బ్రావో, షేన్​ వాట్సన్​, శార్దూల్​ ఠాకూర్​,అంబటి రాయుడు, మురళీ విజయ్​, డుప్లెసిస్

IPL
ధోనీ

ముంబయి ఇండియన్స్

రోహిత్​ శర్మ, హార్ధిక్​ పాండ్య, కృనాల్ పాండ్య​, కౌల్టర్ నైల్​, జస్ప్రీత్​ బుమ్రా, కీరన్‌ పొలార్డ్‌, సూర్యకుమార్​ యాదవ్​, డి కాక్​, మిచెల్ మెక్లెనగన్, ఇషాన్​ కిషన్​, రాహుల్​ చాహర్

దేశంలో కరోనా విజృంభన కారణంగా ఐపీఎల్​ను యూఏఈకి తరలించారు. మరోవైపు వైరస్​ వ్యాప్తి నియంత్రణ క్రమంలో లీగ్​ మొత్తాన్ని బయోసెక్యూర్​ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండానే జరపనున్నారు. 53 రోజులపాటు సాగే ఈ లీగ్​.. నవంబరు 10తో ముగియనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.