కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడటం తనకి కలిసొచ్చిందని టీమ్‌ఇండియా పేసర్ దీపక్ చాహర్ అన్నాడు. ఈ సమయంలో వెన్ను గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తానని తెలిపాడు.
"గాయం నుంచి కోలుకుని మళ్లీ బౌలింగ్ చేయడానికి ఎదురుచూస్తున్నా. ప్రస్తుతానికి నా దృష్టంతా ఫిట్‌నెస్‌పైనే ఉంది. ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవడంలో కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. అయితే గాయం నుంచి కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ ఆరంభమైతే కొన్ని మ్యాచ్‌లు దూరమయ్యేవాడిని."
- దీపక్ చాహర్, చెన్నై సూపర్‌కింగ్స్ బౌలర్
ఐపీఎల్ 13వ సీజన్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేశారు. అయితే దేశమంతా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కరోనా కారణంగా దేశమంతా ప్రస్తుతం క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటోందని చాహర్ అన్నాడు. వ్యాపారులు, ఉద్యోగులు, దినసరి కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారని, త్వరలో సాధారణ స్థితికి చేరుకుంటామని వెల్లడించాడు. గతేడాది డిసెంబర్‌లో వెస్టిండీస్ జరిగిన సిరీస్‌లో చాహర్ గాయడ్డాడు. దీంతో జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇదీ చూడండి.. విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా స్టోక్స్