ETV Bharat / sports

ఆదివారమే ఐపీఎల్ షెడ్యూల్: బ్రిజేశ్ పటేల్

author img

By

Published : Sep 5, 2020, 3:47 PM IST

ఐపీఎల్ షెడ్యూల్​ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. తాజాగా దీనిపై స్పష్టతనిచ్చారు పాలకమండలి ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్.

ఐపీఎల్ షెడ్యూల్​పై బ్రిజేష్ పటేల్ క్లారిటీ

ఐపీఎల్ 13వ సీజన్​ కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు క్రీడాభిమానులు. కానీ ఈ మెగాలీగ్​​ పూర్తి షెడ్యూల్‌ ఇప్పటివరకు రాలేదు. త్వరలో విడుదల చేస్తామని చెప్పడమే తప్పితే క్లారిటీ లేదు. ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ దీనిపై స్పందిస్తూ సెప్టెంబర్ 4న రిలీజ్ చేస్తామని తెలిపారు. కానీ అదీ జరగలేదు. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. దీనిపై ఎట్టకేలకు స్పందించిన ఐపీఎల్ పాలకమండలి ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ షెడ్యూల్​పై క్లారిటీ ఇచ్చారు.

ఆదివారం (సెప్టెంబర్ 6న) లీగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని బ్రిజేష్ స్పష్టం చేశారు. దీంతో అభిమానులు కాస్త ఊరట చెందారు.

లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న జట్లు ప్రాక్టీస్​లో మునిగితేలుతున్నాయి. ఆటగాళ్లు శిబిరాల్లో శిక్షణను వేగవంతం చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను యాజమాన్యాలు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నాయి.

సెప్టెంబర్ 19న ఈ లీగ్ ప్రారంభంకానుంది. అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికలుగా మ్యాచ్​లు జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.