ETV Bharat / sports

ఐపీఎల్ వేలం: భారీ ధర పలికిన కైల్ జేమిసన్ - ipl auction 2021

ఐపీఎల్​ వేలంలో న్యూజిలాండ్ బౌలర్​​ కైల్​ జేమిసన్​ అధిక ధరకు అమ్ముడయ్యాడు. బెంగుళూరు ఫ్రాంచైజీ ఇతడిని రూ.15 కోట్లకు సొంతం చేసుకుంది.

IPL-Auction-Kyle-Jamieson
రూ.15 కోట్లకు అమ్ముడైన జేమిసన్​
author img

By

Published : Feb 18, 2021, 6:38 PM IST

చెన్నై వేదికగా జరుగుతోన్న ఐపీఎల్​ వేలంలో న్యూజిలాండ్​ బౌలర్ కైల్​ జేమిసన్​​ భారీ ధరకు అమ్ముడయ్యాడు. రూ.75 లక్షల కనీస విలువ జాబితాలో ఉన్న ఈ క్రికెటర్​ను బెంగుళూరు జట్టు రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇంగ్లాండ్ బౌలింగ్ ఆల్​రౌండర్​ టామ్​ కరన్​ను దిల్లీ జట్టు కొనుగోలు చేసింది. రూ.5.25 కోట్లకు అతన్ని సొంతం చేసుకుంది.

ఆసీస్​ బ్యాటింగ్​ ఆల్​రౌండర్​ హెన్రిక్స్​ను పంజాబ్​ జట్టు కొనుగోలు చేసింది. కోటి రూపాయల బేస్​ ప్రైస్​లో ఉన్న ఈ క్రికెటర్​ను రూ.4.20 కోట్లకు సొంతం చేసుకుంది.

భారత టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్​మెన్ ఛెతేశ్వర్​ పుజారాను చెన్నై జట్టు కొనుగోలు చేసింది. రూ.50 లక్షల బేస్​ ప్రైస్​కు అతడిని దక్కించుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.