ETV Bharat / sports

ప్రతిభను నమ్మారు.. కోటీశ్వరులయ్యారు - ipl auction

అన్​క్యాప్డ్​ ప్లేయర్లుగా ఉండి ఐపీఎల్​లో అధిక ధరకు అమ్ముడయ్యారు భారత యంగ్​ ప్లేయర్లు షారుక్​​ ఖాన్, చేతన్ సకరియా. అయితే వీరు ఇదివరకు ఏ టీంలకు ఆడారు? ఏ రాష్ట్రం? వీళ్ల కోసం ఫ్రాంఛైజీలు ఇంత ధర ఎందుకు పెట్టాయో తెలుసుకుందాం.

IPL Auction 2021: Who are Shahrukh Khan and Chetan Sakariya
ప్రతిభను నమ్మారు.. కోటీశ్వరులయ్యారు
author img

By

Published : Feb 18, 2021, 8:32 PM IST

చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్​ వేలంలో అనూహ్యంగా అధిక ధరకు అమ్ముడై రికార్డు సృష్టించారు భారత యువ క్రికెటర్లు షారుక్ ఖాన్​, చేతన్​ సకరియా. రూ.20 లక్షల కనీస విలువ జాబితాలో ఉండి.. కోట్ల రూపాయలను తమ ఖాతాలో వేసుకున్నారు. వీరి ప్రస్థానమేంటో తెలుసుకుందామా మరి.

షారుక్​ ఖాన్​:

ఈ పేరు వినగానే బాలీవుడ్​ హీరో షారుక్​ ఖాన్​ గుర్తొస్తాడు. కానీ గత కొంత కాలంగా క్రికెట్​లోనూ ఈ పేరు సుపరిచితమైంది. తమిళనాడుకు చెందిన ఈ యంగ్​ క్రికెటర్​.. బ్యాట్​తోను, బంతితోనూ రాణించగల సమర్థుడు. 2014లో అండర్​-19 వరల్డ్ కప్​లో స్థానం కోల్పోయిన షారుక్​.. తనను తాను మరింత సాన పెట్టుకున్నాడు.

తమిళనాడు ప్రీమియర్​ లీగ్​లో తానెంటో నిరూపించుకున్న ఈ యువ కెరటం.. ఇటీవల జరిగిన సయ్యద్​ ముస్తాక్​ అలీ టోర్నీ క్వార్టర్​ ఫైనల్లో 40 పరుగులు చేసి జట్టును ఫైనల్​ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లోనూ బాగానే ఆడాడు.

టీ20లకు అవసరమైన బ్యాటింగ్‌ వేగం, కండబలం అతడి సొంతం. గతంలో ఆఫ్​ స్పిన్​ వేసేవాడు. ప్రస్తుతం ఫాస్ట్​ బౌలింగ్​పై దృష్టిసారించాడు. కఠిన పరిస్థితుల్లో మ్యాచులను ముగించడం అతడి శైలి.

తాజాగా జరిగిన ఐపీఎల్​ వేలంలో పంజాబ్​ ఫ్రాంచైజీ రూ.5.25 కోట్లకు షారుక్​ను సొంతం చేసుకుంది. నికోలస్‌ పూరన్‌తో కలిసి షారుక్​‌ మ్యాచ్‌ విన్నర్‌గా మారగలడని అతడిని కొనుగోలు చేసింది. గతేడాది ఐపీఎల్​లో ఇతడిపై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు.

చేతన్​ సకరియా:

గుజరాత్​లోని భావ్​నగర్​కు సమీపంలో ఉన్న ఓ గ్రామం నుంచి వచ్చాడు చేతన్​ సకరియా. దేశవాళీలో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ యువ కెరటం. బ్యాటింగ్​తో పాటు బౌలింగ్ చేయగల సత్తా చేతన్​ సొంతం. అతని కోచ్​ రాజేంద్ర గోయల్​ సూచన మేరకు బౌలింగ్​లోనూ రాణిస్తున్నాడు.

జహీర్​ ఖాన్​ మొదలు ప్రస్తుత ఆసీస్​ పేసర్​ మిచెల్​ స్టార్క్​ బౌలింగ్​ చూస్తూ ప్రేరణ పొందాడు చేతన్​. ఇటీవల జరిగిన ముస్తాక్​ అలీ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు ఈ యువ క్రికెటర్​. తాజా వేలంలో రాజస్థాన్​ రాయల్స్ రూ.1.2 కోట్లకు దక్కించుకుంది.

ఇదీ చదవండి: ఐపీఎల్ వేలం: భారీ ధర పలికిన కైల్ జేమిసన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.