ETV Bharat / sports

ఐపీఎల్ వేలం: కృష్ణప్పకు రికార్డు ధర

ఐపీఎల్​ వేలంలో యువ క్రికెటర్​ క్రిష్ణప్ప గౌతమ్​​ భారీ ధరకు అమ్ముడయ్యాడు. చెన్నై సూపర్​ కింగ్స్​ ఇతడిని రూ.9.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఓ అన్​క్యాప్​డ్ ప్లేయర్​కు ఇదే అత్యధిక ధర.

ipl-auction-2021-krishnappa goutham
రూ.9.25 కోట్లతో యువ క్రికెటర్​ గౌతమ్​​ జాక్​పాట్
author img

By

Published : Feb 18, 2021, 5:35 PM IST

చెన్నై వేదికగా జరుగుతోన్న ఐపీఎల్ వేలంలో యువ ఆల్​రౌండర్ క్రిష్ణప్ప గౌతమ్​ భారీ ధరకు అమ్ముడయ్యాడు. రూ.20 లక్షల బేస్​ ప్రైస్​తో వేలంలో పాల్గొన్న ఈ ఆల్​రౌండర్​ను దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరికి రూ.9.25 కోట్ల రికార్డు ధరకు చెన్నై జట్టు ఇతడిని సొంతం చేసుకుంది. లీగ్ చరిత్రలో ఓ అన్​క్యాప్​డ్ ప్లేయర్​కు ఇంత ధర దక్కడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు కృనాల్ పాండ్యా 8.8 కోట్లే అత్యధికం.

మరో యువ క్రికెటర్​ షారుక్​ ఖాన్​ను పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది. రూ.20 లక్షల బేస్​ ప్రైస్​తో ఉన్న ఈ వికెట్​ కీపర్​ను దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరికి రూ.5.25 కోట్లకు పంజాబ్ ఇతడిని​ దక్కించుకుంది.

భారత సీనియర్​ స్పిన్నర్​ పీయూష్​ చావ్లాను రూ.2.4 కోట్లకు ముంబయి జట్టు కొనుగోలు చేసింది.

యువ ఆటగాళ్లు సచిన్​ బేబి, రజత్​ పాటిదార్​లను కనీస ధర రూ.20 లక్షలకు అమ్ముడయ్యారు. ఈ ఇద్దరినీ బెంగుళూరు సొంతం చేసుకుంది.

యువ ఆటగాళ్లు రిపల్​ పటేల్​, విష్ణు వినోద్​ను దిల్లీ క్యాపిటల్స్​ బేస్​ ప్రైస్​ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.