భారత్‌తో వన్డే సిరీస్ ముగించుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. తాజాగా బట్లర్, బెన్ స్టోక్స్, లివింగ్ స్టోన్ రాజస్థాన్ రాయల్స్ క్యాంప్‌లో చేరారు. వీరి రాకకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది రాజస్థాన్ జట్టు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, మేనేజ్మెంట్ బయో బబుల్‌లోకి ప్రవేశించే ముందు వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. అయితే భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌లో పాల్గొన్న వారికి మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. వారు నేరుగా బయోబబుల్‌లోకి ప్రవేశించవచ్చు.
ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9న ప్రారంభంకానుంది. మొదటి మ్యాచ్‌లో రోహిత్ సారథ్యంలోని ముంబయి ఇండియన్స్, కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. రాజస్థాన్ తన తొలి మ్యాచ్‌లో ఏప్రిల్ 12న పంజాబ్ కింగ్స్‌తో పోటీపడనుంది.