ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్‌తో జరగబోయే ప్రారంభ మ్యాచ్‌పై స్పందించాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ గొప్పగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు.
"ముంబయితో జరిగే మ్యాచ్‌లో మా బలాలు, నైపుణ్యాలపై దృష్టిసారిస్తాం. రోహిత్ సేన ఛాంపియన్ జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారికి మ్యాచ్‌ను ఎలా గెలవాలో , వారికున్న బలాలేంటో వారికి తెలుసు. ముంబయి గురించి మరీ ఎక్కువగా గురించి ఆలోచిస్తే.. మేము ఏం చేస్తున్నామనేది స్పష్టత ఉండదు. ఆటలో ఎవరు బాగా ఆడితే వారినే విజయం వరిస్తుంది. ముంబయితో పోటీ పడటం ఆసక్తిగా ఉంటుంది. అది చాలా బలమైన జట్టు. గతేడాది మేము రెండు మ్యాచ్‌ల్లో ఆడగా.. ఒకదాంట్లో మేము మరోదాంట్లో వారు గెలిచారు. మొదటి మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. భారీ స్కోర్లు నమోదయ్యాయి. సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. ఈ సారి కూడా ముంబయితో మ్యాచ్ గొప్పగా ఉంటుందనుకుంటున్నాం"
-విరాట్ కోహ్లీ, బెంగుళూరు కెప్టెన్.
మరోవైపు ముంబయి ఇండియన్స్‌తో జరిగే మొదటి మ్యాచ్ కోసం తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు ఆర్సీబీ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్. ప్రత్యర్థితో పోలిస్తే అనుభవం గల క్రికెటర్లు తమ టీమ్‌లోనూ ఉన్నారని పేర్కొన్నాడు. ఈసారి ఐపీఎల్లో అరంగేట్రం చేస్తున్న డానియల్ క్రిస్టియన్, మాక్స్వెల్, డాన్ సామ్స్, రిచర్డ్సన్ మంచి అనుభవం గల వారని ఏబీ అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి: హేజిల్‌వుడ్ స్థానంలో చెన్నైకి బెహ్రెండార్ఫ్