ETV Bharat / sports

ఐపీఎల్ 2020: బలమైన టాపార్డర్ ఉన్న జట్లివే! - ipl teams

ఐపీఎల్​లో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించేది టాపార్డర్​ బ్యాట్స్​మన్​. వీరి పనితీరుతోనే కప్పు ఎవరి సొంతం అవుతుందో తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో లీగ్ 13వ సీజన్​ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉత్తమ టాపార్డర్​ బ్యాట్స్​మెన్​లను కలిగి ఉన్న​​ జట్లపై ఓ లుక్కేద్దాం రండి.

ipl
ఐపీఎల్​
author img

By

Published : Aug 17, 2020, 7:18 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​) 13వ ఎడిషన్​కు కౌంట్​డౌన్​ ప్రారంభమైంది. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ ఈ ఏడాది ట్రోఫీని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కసరత్తులు చేస్తున్నాయి. కొంత మంది ఆటగాళ్లు ప్రాక్టీసు కూడా మొదలుపెట్టారు. అయితే ఈ లీగ్​లో టాపార్డర్​ బ్యాట్స్​మెన్​పై పెట్టే పెట్టుబడి అంతా ఇంతా కాదు. ఎందుకంటే అత్యధిక పరుగులతో జట్టును గెలుపు దిశగా నడిపించేది వీళ్లే. ఐపీఎల్​ ప్రారంభమైనప్పటి నుంచి ట్రోఫీని దక్కించుకున్న జట్లలో టాపార్డర్ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది కూడా మొదటి ముగ్గురు బ్యాట్స్​మెన్​ పనితీరుపై ఫ్రాంచైజీల అదృష్టం ఆధారపడి ఉంది. ఈ క్రమంలోనే ఐపీఎల్​లో ఉత్తమైన టాపార్డర్​ను​​ కలిగి ఉన్న​ జట్ల గురించి తెలుసుకుందాం.

దిల్లీ క్యాపిటల్స్

టాపార్డర్​ బ్యాట్స్​మెన్​: శిఖర్​ ధావన్​, పృథ్వీ షా, అజింక్య రహానె, జాసన్​ రాయ్​, శ్రేయస్​ అయ్యర్

​గత సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్​ రెండో క్వాలిఫయర్​ వరకు చేరుకోగలిగింది. ఈ లీగ్​లో శిఖర్​ ధావన్​ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 135.67 స్ట్రైక్​ రేట్​తో 16 మ్యాచ్​ల్లో 521 పరుగులు సాధించాడు. శ్రేయస్​ అయ్యర్​ కూడా 463 పరుగులు సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అజింక్యా రహానె, జాసన్​ రాయ్​ కూడా సత్తాచాటారు. గతేడాది రాజస్థాన్​ రాయల్స్ తరఫున ఆడిన రహానె.. 13 మ్యాచ్​ల్లో 393 పరుగులు చేశాడు. ఇక విధ్వంసకర బ్యాట్స్​మన్​ రాయ్​​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ముంబయి ఇండియన్స్​

టాపార్డర్​ బ్యాట్స్​మెన్:​ రోహిత్​ శర్మ, క్వింటన్​ డికాక్​, క్రిస్​ లిన్​, సూర్య కుమార్​ యాదవ్​, ఇషాన్​ కిషన్​

గత ఎడిషన్​లో ముంబయి ఇండియన్స్ టైటిల్​ గెలుపునకు ప్రధాన కారణాల్లో ఒకటి.. జట్టు టాపార్డర్ దృఢంగా ఉండటమే. ఆడిన 16 మ్యాచ్​ల్లో క్వింటన్​ డికాక్​ 529 పరుగులు చేశాడు. టీమ్​ఇండియా పరిమిత ఓవర్ల వైస్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ 15 మ్యాచ్​ల్లో 405 పరుగులు చేసి.. అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యంతో జట్టును విజయంవైపు నడిపించాడు. టీమ్​ కోసం పూర్తి నిబద్ధతతో మైదానంలో నిలబడే యువ ఆటగాళ్లలో సూర్య కుమార్​ యాదవ్​ ముందుంటాడు. గత సీజన్​లో 16 మ్యాచ్​ల్లో 524 పరుగులు చేసి.. ఈసారి మళ్లీ చెలరేగేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక క్రిస్​ లిన్​, ఇషాన్​ కిషన్​లూ జట్టులో కీలక పాత్ర పోషించనున్నారు.

కింగ్స్ ఎలెవెన్​ పంజాబ్​

టాపార్డర్​ బ్యాట్స్​మెన్​: క్రిస్​ గేల్​, కేఎల్​ రాహుల్​, మయాంక్​ అగర్వాల్​, నికోలస్​ పూరన్​, కరుణ్​ నాయర్​

2019 ఐపీఎల్​ ట్రోఫీని దక్కించుకోవడానికి కింగ్స్ ఎలెవెన్​ పంజాబ్​ ఎంతగానో తపించింది. మంచి ఆరంభం లభించినప్పటికీ.. చివరకు ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, కప్​ను కైవసం చేసుకునేందుకు జట్టులో అద్భుతమైన టాపార్డర్​ బ్యాట్స్​మెన్​ ఈ జట్టులో ఉన్నారు.

విధ్వంసకర బ్యాట్స్​మన్​ క్రిస్​గేల్​ మైదానంలో అడుగుపెడితే చాలు..మ్యాచ్​పై అభిమానుల అంచనాలు పెరిగిపోతాయి. నిరుడు జరిగిన ఐపీఎల్​లో 13 మ్యాచ్​ల్లో 493 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 14 ఇన్నింగ్స్​ల్లో 593 పరుగులు సాధించిన కేఎల్​ రాహుల్​.. జట్టులో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈసారి జట్టుకు కెప్టెన్​గానూ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మయాంక్​ అగర్వాల్​ గత సీజన్​లో 13 మ్యాచ్​ల్లో 332 పరుగులు చేసి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. నికోలస్​ పూరన్​, కరుణ్​ నాయర్​లు టాపార్డర్​లో​ కనిపించడం చాలా అరుదు. అయితే, సాధారణ ఆటగాళ్లకు గాయమైనప్పుడు వారి స్థానంలో బరిలోకి దిగుతారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.