ETV Bharat / sports

ఐపీఎల్: స్వదేశీ స్టార్స్​ ఈ జట్ల సొంతం.. - IPL 2020: Three sides who have a strong set of Indian players ahead of the auction

వచ్చే ఐపీఎల్​ కోసం ఆటగాళ్ల వేలం ఈ నెల 19న జరగనుంది. ఇప్పటికే అన్ని జట్లు గెలుపు గుర్రాలను దక్కించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే ఈసారి వేలం కంటే ముందుగానే కొన్ని జట్లు స్వదేశీ ప్లేయర్స్​తో బలంగా కనిపిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

IPL 2020
ఐపీఎల్
author img

By

Published : Dec 13, 2019, 5:52 PM IST

కోల్​కతా వేదికగా ఈనెల 19న ఐపీఎల్-2020 ఆటగాళ్ల వేలం జరగనుంది. ఈ వేలం కోసం అన్ని జట్లు ఇప్పటికే తగిన ప్రణాళికల్ని రచించుకుంటున్నాయి. బెంగళూరు, దిల్లీ జట్లు సగం మంది ఆటగాళ్లను వదులుకోగా, ముంబయి, చెన్నై ప్రధాన ఆటగాళ్లను అంటిపెట్టుకుని మరోసారి లీగ్​లో సత్తాచాటాలని భావిస్తున్నాయి. అయితే జట్టులో ఎంతమంది ఉన్నా తుది టీమ్​లో మాత్రం కేవలం నలుగురు విదేశీ ప్లేయర్స్​ మాత్రమే ఆడాలి. అందువల్ల స్వదేశీ ఆటగాళ్లను ఎక్కువగా ఉపయోగించుకోవడం ముఖ్యం. ఈసారి స్వదేశీ ఆటగాళ్లు ఎక్కువగా కలిగి ఉన్న జట్ల వివరాలు చూద్దాం.

చెన్నై సూపర్ కింగ్స్

ఈసారి 20 మందిని అంటిపెట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురు ఆటగాళ్లను వదులుకుంది. కెప్టెన్​ ధోనీతో పాటు ఆల్​రౌండర్ సురేశ్ రైనా జట్టుకు పెద్ద బలం. అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికి మళ్లీ మనసు మార్చుకున్న తెలుగు తేజం అంబటి రాయుడు.. ఈసారి ఐపీఎల్​లో సత్తాచాటాలని భావిస్తున్నాడు. ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా ఫామ్​ చెన్నైకి అదనపు బలం. బౌలింగ్​ విభాగంలో వెటరన్ ప్లేయర్ హర్భజన్ సింగ్​తో పాటు యువ ఆటగాళ్లు కేఎస్ ఆసిఫ్, దీపక్ చాహర్​ బంతితో మాయ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

IPL 2020
చెన్నై సూపర్ కింగ్స్

దిల్లీ క్యాపిటల్స్

చెన్నై తర్వాత స్వదేశీ టాలెంట్​ను ఎక్కువగా కలిగి ఉంది దిల్లీ క్యాపిటల్స్. ఆరు సీజన్ల తర్వాత 2019 లో ప్లేఆఫ్స్​కు అర్హత సాధించి జోరుమీదుంది. ఈ సీజన్​లోనూ సత్తాచాటాలని భావిస్తోంది. ఈసారి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, బ్యాట్స్​మన్ అజింక్యా రహానేలను ట్రేడింగ్ విండో పద్ధతిలో కొనుగోలు చేసి మరింత బలంగా తయారైంది. వీరితో పాటు శిఖర్ ధావన్, పృథ్వీ షా, సారథి శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్​లాంటి స్వదేశీ స్టార్స్​తో బలంగా ఉంది క్యాపిటల్స్. బౌలింగ్​లో అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్ ఉండనే ఉన్నారు.

IPL 2020
దిల్లీ క్యాపిటల్స్

ముంబయి ఇండియన్స్

ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్స్​గా బరిలోకి దిగుతున్న ముంబయి ఇండియన్స్​ టైటిల్​ను నిలబెట్టుకోవాలని భావిస్తోంది. 10 మంది ఆటగాళ్లను వదులుకున్న ముంబయి ప్రధాన ఆటగాళ్లను అంటిపెట్టుకుంది. ఈ జట్టులో ముఖ్యంగా సారథి రోహిత్ శర్మతో పాటు బౌలింగ్​లో జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారు. వీరిద్దరే కాక పాండ్య సోదరులు, యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్​ సత్తా చాటాలని భావిస్తున్నారు. బౌలింగ్​ విభాగంలో రాహుల్ చాహర్, అన్​మోల్​ప్రీత్ సింగ్, అనుకూల్ రాయ్ లాంటి యువ బౌలర్లు ఉన్నారు.

IPL 2020
ముంబయి ఇండియన్స్

ఇవీ చూడండి.. ఐపీఎల్​ 2020: వేలంలోకి 332 మంది.. అవకాశం 73 మందికే

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Tianhe Gymnasium, Guangzhou, China. 13th December 2019.
Group Stage of the BWF World Tour Finals:
Men's Singles: Chen Long (China) beat Chou Tien Chen (Chinese Taipei) 21-15, 21-19
1. 00:00 Players walk out
2. 00:09 First game, Game point, Chen Long wins 21-15
3. 00:28 Second game, Match point, Chen Long wins 21-15, 21-19
Men's Singles: Anthony Ginting (Indonesia) beat Victor Axelsen (Denmark) 13-6 retired
4. 00:58 Players at coin toss
5. 01:05 First game, Ginting wins point to lead 9-3
6. 01:15 First game, Ginting wins point to lead 13-6 before Axelsen retires
Women's singles: Nozomi Okuhara (Japan) beat Ratchanok Intanon (Thailand) 21-14, 21-12
7. 01:55 Players at coin toss
8. 02:00 First game, Intanon wins point, Okuhara leads 18-12
9. 02:13 Second game, Match point, Okuhara wins 21-14, 21-12
Men's Doubles: Lee Yang and Wang Chi-Lin (Chinese Taipei) beat Mohammad Ahsan and Hendra Setiawan (Indonesia) 21-18, 21-18.  
10. 02:28 Second game, Lee and Wang win point to lead 19-17
11. 02:45 Second game, match point, Lee and Wang win 21-18, 21-18
Mixed Doubles: Zheng Siwei and Huang Yaqiong (China) beat Praveen Jordan and Melati Daeva Oktavianti (Indonesia) 21-8, 15-21, 22-20
12. 00:30 Third game, Match point, Zheng and Huang win 21-8, 15-21, 22-20
SOURCE: Infront Sports
DURATION: 03:18
STORYLINE:
Chen Long and Anthony Ginting reached semi-finals at the BWF (Badminton World Federation) World Tour Finals in Guangzhou, China on Friday.
Olympic champion Chen Long from China beat world number two Chou Tien Chen from Chinese Taipei 21-15, 21-19 in Group B to secure his spot in Saturday's semi-final.
Indonesia's Anthony Ginting won the group following the Dane Victor Axelsen's retirement due to leg injury after eight minutes into the first game.
In women's singles, Nozomi Okuhara of Japan beat the Thai Ratchanok Intanon 21-14, 21-12 to secure her semi-final spot, along with the Taiwanese shuttler Tai Tzu Ying.
Chinese Taipei duo Lee Yang and Wang Chi Lin and Indonesia stars Mohammad Ahsan and Hendra Setiawan were both through to the men's doubles semi-finals.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.