కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా క్రీడా టోర్నీలు, లీగ్‌లు వాయిదా పడ్డాయి. కొన్ని రద్దయ్యాయి. ఈ సమయంలో వివిధ ఫ్రాంఛైజీలు, క్లబ్బులు, క్రీడా సంస్థలు.. ఇంటర్నెట్ ద్వారా అభిమానులను అలరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఐపీఎల్.. ధోనీ ఫొటో పోస్ట్ చేసి, కరోనాపై అవగాహన కల్పిస్తోంది.
-
Stay Home 🏡
— IndianPremierLeague (@IPL) March 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Stay safe you guys ✌️💛💛 pic.twitter.com/MR4pQ9iHJZ
">Stay Home 🏡
— IndianPremierLeague (@IPL) March 24, 2020
Stay safe you guys ✌️💛💛 pic.twitter.com/MR4pQ9iHJZStay Home 🏡
— IndianPremierLeague (@IPL) March 24, 2020
Stay safe you guys ✌️💛💛 pic.twitter.com/MR4pQ9iHJZ
ఆటగాళ్లు ఇంట్లోనే సాధన
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే క్రీడలకు సంబంధించిన అన్ని పనులు నిలిచిపోయాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సూచనల మేరకు ఆటగాళ్లు సామాజిక దూరం పాటిస్తున్నారు. స్వీయనిర్బంధంలో ఉంటూ సాధన చేస్తున్నారు.
ఐపీఎల్ వాయిదా
దేశంలో ఈ వైరస్ విస్తరిస్తున్న తరుణంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఐపీఎల్‌ను ఏప్రిల్ 15 కు వాయిదా వేశారు. అయితే ఈ లీగ్‌ను మరికొంతకాలం వాయిదా వేయాలా? రద్దు చేయాలా? అనే ఆలోచనలో ఉంది బీసీసీఐ.
ఇదీ చదవండి: ఐపీఎల్ రద్దవుతుందా? వాయిదా పడుతుందా?