ETV Bharat / sports

ఐపీఎల్​లో ఒక్కో జట్టుకు ఒక్కో చోట వసతి - ipl latest news

ఐపీఎల్​ ఫ్రాంచైజీలు అనుసరించాల్సిన మార్గర్శకాలను బీసీసీఐ ప్రకటించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

IPL
ఐపీఎల్
author img

By

Published : Aug 6, 2020, 5:32 AM IST

Updated : Aug 6, 2020, 6:12 AM IST

యూఏఈలో ఐపీఎల్​ నిర్వహించనున్న వేళ.. ఫ్రాంచైజీలకు మార్గదర్శకాలు సూచించింది బీసీసీఐ. ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆటగాళ్లు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఓ లిస్టు ఏర్పాటు చేసింది. స్వదేశం నుంచి బయలుదేరిన మొదలు టోర్నమెంటులో చివరి బంతి పడే వరకు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.

ఇందులో భాగంగా లక్షణాలు లేని కొవిడ్​ కేసులను తగ్గించేందుకు ఐపీఎల్​ జరిగినన్ని రోజులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. వీటితో పాటు ఫ్రాంచైజీలు వేర్వేరు హోటళ్లలో బస చేయడం, డ్రెస్సింగ్​ రూమ్​ల్లో భౌతిక దూరం పాటించడం, ఎలక్ట్రానిక్​ టీమ్ షీట్లు, వర్చువల్​ టీమ్ సమావేశాలు తదితర మార్గదర్శకాలను అనుసరించాలని ఆదేశించింది.

ఫ్యామిలీలు రావొచ్చు..

క్రీడాకారుల కుటుంబ సభ్యులు యూఏఈకి ప్రయాణించడంపై ఎటువంటి నిషేధం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రోటోకాల్స్​ను తప్పనిసరిగా పాటించేలా సంబంధిత ఫ్రాంచైజీలు చూసుకోవాలని పేర్కొంది.

సెప్టెంబరు 19న యూఏఈ వేదికగా ఐపీఎల్​ ప్రారంభం కానుంది. చివరి మ్యాచ్​ నవంబరు 10న జరగనుంది.

Last Updated : Aug 6, 2020, 6:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.