ఈ ఏడాది ఐపీఎల్‌ను ప్రత్యేక్ష ప్రసారం, మిగతా ప్రసారాలు కలిపి మొత్తం భారత్‌లో టీవీల్లో 55 కోట్ల మందికి పైగా వీక్షించే అవకాశముందని స్టార్ ఇండియా ఛైర్మన్ శంకర్ అన్నారు.
ఐపీఎల్ వీక్షకుల విషయంలో ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో కన్నా ఈ సారి మరింత ఎక్కువ మంది చూస్తారని నమ్ముతున్నా. ఏడు భాషల్లో ప్రసారాలు ఉండనున్నాయి. అందుకు 90మంది వ్యాఖ్యాతల బృందం సిద్ధంగా ఉంది. ప్రత్యేక్ష ప్రసారం, మిగతా ప్రసారాలు కలిపి మొత్తం భారత్‌లో 55 కోట్ల మందికి పైగా ఈ సీజన్‌ను టీవీల్లో వీక్షిస్తారని అంచనా వేస్తున్నాం. 100కు పైగా దేశాల్లో ఈ లీగ్‌ను ప్రసారం చేయనున్నాం.
-శంకర్, స్టార్ ఇండియా ఛైర్మన్
ఈ సీజన్ ప్రకటన కోసం ఇప్పటికే 75 శాతం వాటా అమ్మడం పూర్తయిందని ఆ లీగ్ అధికారిక ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ సీఈఓ గౌతమ్ దాకర్ వెల్లడించారు. దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10వరకు ఈ మెగాలీగ్ జరగనుంది.
ఇదీ చూడండి యుఎస్ ఓపెన్ : ముర్రే కథ ముగిసె.. అజరెంకా ముందంజ