ETV Bharat / sports

ఐపీఎల్: సీఎస్కేతో ముంబయి జట్టు ప్రారంభ మ్యాచ్​ కష్టమే! - latest ipl news updates

కరోనా పరీక్షల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు పాజిటివ్​ తేలిన వేళ.. ముంబయి జట్టుతో ప్రారంభ మ్యాచ్​పై గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే వేరే జట్టుతో మ్యాచ్​ను నిర్వహించే వీలుపై అధికారులు ఆలోచిస్తున్నారని సమాచారం.

IPL 2020
ఐపీఎల్​
author img

By

Published : Aug 31, 2020, 10:35 AM IST

ఈ ఏడాది ఐపీఎల్​ కోసం దుబాయ్​ చేరుకున్న ఫ్రాంచైజీల్లో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. ఇటీవలే కరోనా పరీక్షలు నిర్వహించగా.. చెన్నై సూపర్​కింగ్స్​ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బందికి పాజిటివ్ నిర్ధరణ అయినట్లు బీసీసీఐ తెలిపింది. దీంతో ఐపీఎల్​ షెడ్యూల్​పై గందరగోళం ఏర్పడింది. సెప్టెంబరు 19న ప్రారంభ మ్యాచ్​ను సీఎస్కే, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య నిర్వహించాలని బీసీసీఐ భావించింది.

అయితే, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ జట్లతో మ్యాచ్​ జరిపే అవకాశాలు కనిపించడం లేదు. సీఎస్కే ఆటగాళ్లకు పాజిటివ్​ తేలినందున.. 14 రోజుల పాటు క్వారంటైన్​లో ఉండనున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్​ను వేరే జట్టు ప్రారంభించే అవకాశాలున్నట్లు బోర్డు అధికారిక వర్గాలు తెలిపాయి.

"నాకు తెలిసి రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు(ఆర్సీబీ)తో ప్రారంభ మ్యాచ్ జరగొచ్చు. ఎందుకంటే, తొలి మ్యాచ్​లో స్టార్ ప్లేయర్లు​ మైదానంలో కనిపించడం అవసరం. ఇప్పుడు ధోనీతో కుదరకపోతే.. కోహ్లీ జట్టుతోనే ప్రారంభించే అవకాశం ఉంది. సీఎస్కే ప్రారంభ మ్యాచ్​ను ఆడుతుందా లేదా అనే విషయంపై పాలక మండలి స్పష్టతనిచ్చే వరకు వేచి చూడాలి."

-బీసీసీఐ అధికారిక వర్గాలు

యూఏఈలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలువురు ఆటగాళ్లు పేర్కొన్నారు. శిక్షణ పొందుతున్న సమయంలో ప్రాక్టీస్​ వేదిక వద్ద లైట్లు ఆగిపోయాయని ఒక ఆటగాడు తెలిపాడు. జట్టు సిబ్బందికి ఇప్పటికీ ట్రాకింగ్​ బ్యాండ్లు అందలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వినేందుకు బీసీసీఐకి సమయం దొరకడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.