ETV Bharat / sports

ఐపీఎల్​కు ముందు ఆటగాళ్ల ప్రాక్టీస్ దుబాయ్​లోనే! - బీసీసీఐ వార్తలు

సెప్టెంబర్​లో ఐపీఎల్ ప్రారంభం దృష్ట్యా మొతేరా స్టేడియంలో బీసీసీఐ కాంట్రాక్ట్ ప్లేయర్లందరికీ శిక్షణ ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై తాజాగా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ తమకు బోర్డు నుంచి ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు.

ఐపీఎల్​కు ముందు ఆటగాళ్లకు శిక్షణ దుబాయ్​లోనే!

author img

By

Published : Jul 30, 2020, 11:58 AM IST

కరోనా నేపథ్యంలో దేశంలో ఇప్పుడిప్పుడే క్రీడలు ప్రారంభమయ్యే అవకాశం లేదు. కాంట్రాక్టు క్రికెటర్లకు ఇప్పటివరకు శిక్షణా శిబిరాలను కూడా ఏర్పాటు చేయలేదు బీసీసీఐ. ఆగస్టు రెండో వారం నుంచి ప్రాక్టీస్​కు అనుమతి ఉంటుందని అంతా అనుకున్నారు. గుజరాత్ మొతేరా స్టేడియంలో ఐపీఎల్​లో పాల్గొనే కాంట్రాక్ట్ ఆటగాళ్లందరికీ శిక్షణ కల్పించాలని భావించారు. కానీ ప్రస్తుతం అది సాధ్యమయ్యేలా లేదు.

క్రికెటర్లు వచ్చే నెల దుబాయ్ వెళ్లాక అక్కడే నేరుగా ప్రాక్టీస్ శిబిరాల్లో పాల్గొనే అవకాశం ఉంది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్​కు ముందు ఆటగాళ్లకు శిక్షణ దుబాయ్​లోనే!
ఐపీఎల్​కు ముందు ఆటగాళ్లకు శిక్షణ దుబాయ్​లోనే!

"ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 4 వరకు మొతేరా స్టేడియంలో ఆటగాళ్లకు శిక్షణా శిబిరాలు ప్రారంభమవుతాయని వార్తలు వస్తున్నాయి. కానీ మాకు ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎటువంటి సమాచారం అందలేదు."

-గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధికారి

ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్ల ఆరోగ్య భద్రతకే బీసీసీఐ ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తోంది. వారి ఇళ్ల నుంచి అహ్మదాబాద్ వెళ్లి.. మళ్లీ అక్కడి నుంచి దుబాయ్​కు చేరుకునే క్రమంలో ఎక్కువ రిస్క్ చేయాల్సి ఉంటుందని భావిస్తోంది. అందుకే దుబాయ్​లోనే ఆటగాళ్ల ప్రాక్టీస్​కు వీలుగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.