యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ 13వ సీజన్ జరగనుంది. అయితే తాజాగా దీనిపై బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ అధినేత అజిత్ సింగ్ మాట్లాడారు. ఈ మెగాటోర్నీలో ఎలాంతి అవినీతి (ఫిట్టింగ్, బెట్టింగ్ తదితర అంశాలు) జరగకుండా.. పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
ఆటగాళ్లను ప్రత్యక్షంగా ఎవరూ సంప్రదించకుండా, వారితో సంభాషించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని అజిత్ స్పష్టం చేశారు. ఎందుకంటే మ్యాచ్ ఫిక్సర్లు ఆటగాళ్లకు ఆశ చూపడానికి ఏ రూపంలోనైనా రావొచ్చని అన్నారు. ఐపీఎల్ ముగిసేవరకు ఆటగాళ్లు, మిగితా సహాయక సిబ్బంది సహా ఇతరులపై ఓ కన్నేసి ఉంచుతామని ఆయన తెలిపారు. ఇందుకోసం సాంకేతికత సాయం కూడా తీసుకోనున్నట్లు వెల్లడించారు అజిత్ .
కరోనా నేపథ్యంలో ఈ మెగాటోర్నీని బయో సెక్యూర్ వాతవరణంలో నిర్వహించనున్నారు.
ఇది చూడండి విలియమ్స్ సిస్టర్స్ వార్.. సెరెనా జయకేతనం