ETV Bharat / sports

ఐపీఎల్​ 2020: సఫారీ ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానం!

ఐపీఎల్​ కోసం దక్షిణాఫ్రికా ఆటగాళ్లను ప్రత్యేక విమానంలో యూఏఈకి తీసుకురావాలని ఫ్రాంఛైజీలు అనుకుంటున్నాయి. ఆదివారం జరిగే ఐపీఎల్​ కౌన్సిల్​ సమావేశం తర్వాత ఈ విషయమై స్పష్టత రానుంది.

IPL 2020: Franchises ready to pool in to get South African players to UAE
ఐపీఎల్​ 2020: సఫారీ ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానం!
author img

By

Published : Jul 31, 2020, 7:25 PM IST

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) ఆరంభం కానుంది. ఇందులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఆసక్తి చూపుతున్నారు. కానీ కరోనా వ్యాప్తి వల్ల ఆ దేశంలో విధించిన విమాన ప్రయాణ ఆంక్షలు కఠినతరం చేశారు. దీంతో వారిని ప్రత్యేక విమానంలో యూఏఈకి తీసుకొచ్చేందుకు ఫ్రాంఛైజీలు సన్నాహాలు చేస్తున్నాయి.

దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్​ (రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు), కగిసో రబాడా (దిల్లీ క్యాపిటల్స్​), డుప్లెసిస్​ (చెన్నై సూపర్​కింగ్స్​), క్వింటన్​ డికాక్​ (ముంబయి ఇండియన్స్​) లాంటి క్రికెటర్లు పాల్గొనున్నారు.​

ఆదివారం (ఆగస్టు 2) జరిగే ఐపీఎల్​ పాలకమండలి​ సమావేశం తర్వాత సఫారీ ఆటగాళ్లను ఏ విధంగా యూఏఈ తీసుకురావాలనే దానిపై స్పష్టత వస్తుందని ఓ ఫ్రాంఛైజీ అధికారి వెల్లడించారు.

ఆదివారం రానున్న స్పష్టత!

"దక్షిణాఫ్రికా క్రికెటర్లు.. ప్రయాణ ఆంక్షలు కారణంగా ఐపీఎల్​కు రాలేకపోతున్నారు. ఈ సమస్య ఒక్క ఫ్రాంఛైజీకి మాత్రమే సంబంధించినది కాదు. దాదాపు అన్ని జట్లలో ఈ దేశ ఆటగాళ్లు ఉన్నారు. వారందరి కోసం ఓ చార్టెడ్​ విమానాన్ని సిద్ధం చేసి, ఆ ఖర్చును యాజమాన్యాలు షేర్​ చేసుకుంటాయి. ఆదివారం జరిగే భేటీ​ తర్వాతే ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకుంటాం" అని ఆ అధికారి చెప్పారు.

ఆ హోటళ్లలోనే ఉంటాం

అబుదాబి, దుబాయ్​లో ఆటగాళ్లను ఉంచాలని ఫ్రాంఛైజీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ దేశాలకు ముందు ఓ బృందాన్ని పంపించాలని బీసీసీఐ అనుకుంటోంది. "షార్జాలో ఉండేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. మీకు అబుదాబి, దుబాయ్​లలో 15 అంతర్జాతీయ హోటళ్లలు ఉన్నాయి. మేం అక్కడే ఉండాలని చూస్తున్నాం. బీసీసీఐ ముందుగా ఓ జట్టును పంపాలని యోచిస్తున్నట్లు మాకు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వాణిజ్య విమానాలు లేనందున.. ఆటగాళ్ల కోసం ప్రత్యేకమైన చార్టడ్​ విమానాలు నడపాల్సి ఉంటుంది" అని ఓ ఫ్రాంచైజీ అధికారి తెలియజేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.