ETV Bharat / sports

మైదానంలో ముంబయి జట్టు కసరత్తులు ప్రారంభం!

author img

By

Published : Aug 30, 2020, 8:21 AM IST

వారం రోజుల పాటు క్వారంటైన్​ పూర్తి చేసుకున్న ముంబయి ఇండియన్స్ జట్టు ఐపీఎల్​ కోసం ట్రైనింగ్​ ప్రారంభించింది. సుదీర్ఘ విరామం అనంతరం మైదానంలో అడుగుపెట్టడంపై ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

rohit sharma
రోహిత్​ శర్మ

ఈ ఏడాది ఐపీఎల్​ కోసం దుబాయ్​ చేరుకున్న ఫ్రాంచైజీల్లో ముంబయి ఇండియన్స్​ ఒకటి. ఈ క్రమంలోనే వారం రోజుల పాటు క్వారంటైన్ పూర్తి చేసుకున్న​ తర్వాత.. శనివారం అబుదాబిలోని షేక్​ జాయెద్​ క్రికెట్​ స్టేడియంలో జట్టు తొలి శిక్షణ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్రాంచైజీ ట్విట్టర్​లో అభిమానులతో పంచుకుంది. రోహిత్​ శర్మ, హార్దిక్​ పాండ్య, కృనాల్​ పాండ్య, జస్ప్రీత్​ బుమ్రా తదితరులు కసరత్తులు చేస్తూ కనిపించారు. ప్రతి చోటా కొవిడ్​ నిబంధనలను పాటిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ సందర్భంగా రోహిత్​ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత మైదానంలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని అన్నాడు. "ఇక్కడ చాలా వేడిగా ఉంది. కాబట్టి పరిస్థితులు, ఇక్కడి పిచ్​ వాతావరణం ఇలా అన్నింటినీ అనుగుణంగా మలచుకోవాలి. కొద్ది రోజులు శిక్షణ తీసుకోవడం మంచిది" అని రోహిత్​ పేర్కొన్నాడు.

హార్దిక్​ పాండ్య, సూర్య కుమార్​ యాదవ్​ తదితరులూ.. క్వారంటైన్​ పూర్తి చేసుకుని సుదీర్ఘ కాలం తర్వాత మైదానంలో అడుగుపెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 19న ప్రారంభం కానుంది లీగ్. బయో సెక్యూర్​ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్​ను నిర్వహించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.