ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్‌లో తమ జట్టు సారథిగా డేవిడ్ వార్నర్‌ను నియమిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. గతంలో కెప్టెన్‌గా పనిచేసిన కేన్ విలియమ్సన్.. ఆటగాడిగా కొనసాగనున్నాడు.
కెప్టెన్‌గా కప్పు తెచ్చాడు..
డేవిడ్ వార్నర్.. 2016లో సన్‌రైజర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సీజన్‌లోనే జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. మరోసారి వార్నర్ జట్టును విజేతగా నిలుపుతాడనే నమ్మకంతోనే ఫ్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
-
🚨Announcement🚨#OrangeArmy, our captain for #IPL2020 is @davidwarner31. pic.twitter.com/lV9XAMw6RS
— SunRisers Hyderabad (@SunRisers) February 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">🚨Announcement🚨#OrangeArmy, our captain for #IPL2020 is @davidwarner31. pic.twitter.com/lV9XAMw6RS
— SunRisers Hyderabad (@SunRisers) February 27, 2020🚨Announcement🚨#OrangeArmy, our captain for #IPL2020 is @davidwarner31. pic.twitter.com/lV9XAMw6RS
— SunRisers Hyderabad (@SunRisers) February 27, 2020
2018లో బాల్ ట్యాంపరింగ్ నేపథ్యంలో.. వార్నర్ ఆ ఏడాది జరిగిన ఐపీఎల్ ఆడలేదు. 2019 ఐపీఎల్ ప్రారంభమయ్యే సమయానికి అతనిపై ఉన్న నిషేధం ముగియడం వల్ల తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే కెప్టెన్సీ మాత్రం కేన్ విలియమ్సన్కు అప్పగించారు. రీఎంట్రీలో వార్నర్ బ్యాటింగ్‌లో తన సత్తా చాటాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్, సన్‌రైజర్స్ మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టోతో కలిసి అద్భుత భాగస్వామ్యాలు నమోదు చేశాడు. అంతేకాకుండా 692 పరుగులతో గతేడాది టోర్నీ అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్నూ సొంతం చేసుకున్నాడు వార్నర్.