ETV Bharat / sports

అరుదైన రికార్డుపై కన్నేసిన రవీంద్ర జడేజా - ravindra jadeja ipl runs rexord

ఐపీఎల్​ కెరీర్​లో 1,927 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా.. ఈ సీజన్​లో అరుదైన ఘనత సాధించనున్నాడు. మరో 73 పరుగులు చేస్తే లీగ్ చరిత్ర​లోనే 2 వేల పరుగుల మార్క్​ను అందుకున్న తొలి ఆల్​రౌండర్​గా రికార్డుకెక్కుతాడు.

Jadeja
జడేజా
author img

By

Published : Sep 18, 2020, 9:15 AM IST

రవీంద్ర జడేజా.. ఐపీఎల్​లోని ఉత్తమ ఆల్​రౌండర్లలో ఒకడు. ఈ మెగాలీగ్​లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నాడు. 2012లో తొలిసారిగా రూ.9.72 కోట్లకు ఇతడిని ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. అప్పుడు ఆ జట్టులో అత్యధిక పారితోషికం తీసుకున్న ఆటగాడు అతనొక్కడే. అనంతరం 2019,20 సీజన్​కు వచ్చేసరికి జట్టుకు వెన్నెముకలా ఎదిగాడు.

మొత్తంగా కెరీర్​లో సీఎస్కేతో సహా రాజస్థాన్​ రాయల్స్​, కొచి టస్కర్స్​ కేరళ, గుజరాత్​ లయన్స్​ తరఫున ఆడిన జడేజా.. 170 మ్యాచ్​ల్లో 1,927 పరుగులు చేశాడు. తద్వారా ఈ సీజన్​లో అరుదైన మైలురాయిని అందుకునేందుకు సిద్ధమయ్యాడు. మరో 73 పరుగులు చేస్తే 100వికెట్లు సహా 2 వేల పరుగుల మార్క్​ను చేజిక్కించుకోనున్నాడు. ఫలితంగా ఐపీఎల్​లోనే ఈ ఘనత అందుకున్న తొలి ఆల్​రౌండర్​గా రికార్డుకెక్కనున్నాడు.

సెప్టెంబరు 19న ప్రారంభమయ్యే ఐపీఎల్​ ఆరంభ మ్యాచ్​లో ధోనీ నేతృత్వంలోని సీఎస్కే, రోహిత్​ శర్మ నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్​ తలపడనున్నాయి.

ఇదీ చూడండి కరోనా వీరులకు సంఘీభావం.. ఆర్సీబీ కొత్త జెర్సీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.