పార్లమెంటులో పౌరసత్వ చట్ట సవరణ ఆమోదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ సెగ ఈ నెల 19న జరగనున్న ఐపీఎల్ వేలానికి తాకనుంది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే కోల్కతా వేదికగా వేలం నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది.
"సోమవారం సాయంత్రం నుంచే వేలం ఏర్పాటు ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఫ్రాంఛైజీ యాజమాన్యాలు కోల్కతాకు రానున్నాయి. బుధవారం ఉదయానికి అక్కడకు చేరుకుంటారు. అనుకున్న ప్రకారమే వేలం జరుగుతుంది" -బీసీసీఐ ప్రతినిధి
ఈ వేలానికి 332 ఆటగాళ్లు అందుబాటులో ఉండనున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్, దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నమోదు చేశారు. ఈ సీజన్లో మొత్తం 73 స్థానాలను భర్తీ చేసేందుకు 8 ఫ్రాంఛైజీలు పోటీపడుతున్నాయి. ఇందులో 29 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
ఇదీ చదవండి: ఆసీస్ క్రికెట్లో మరో మిస్సైల్.. మెరిపిస్తున్న లబుషేన్