ETV Bharat / sports

ఐపీఎల్​లో​ ఈ రికార్డులను కొట్టడం కష్టమేనా! - ఐపీఎల్​ తొలి ఐదు రికార్డులు

మరో మూడు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈసారి సరికొత్త రికార్డులు, అరుదైన ఘనతలు సాధించేందుకు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. అయితే గతంలో నెలకొల్పిన కొన్ని రికార్డుల్ని మాత్రం ఇప్పటివరకు ఎవరూ అందుకోలేకపోయారు. వాటిని ఈ సీజన్​లోనైనా అధిగమిస్తారా? లేదా?

IPL
ఐపీఎల్
author img

By

Published : Sep 16, 2020, 12:38 PM IST

ఐపీఎల్​.. బ్యాట్స్​మెన్, బౌలర్లకు ఓ సవాలు లాంటిది. భిన్న వాతావరణం, విభిన్న దేశాల ఆటగాళ్లతో హోరాహోరీగా తలపడుతూ వారి సత్తాను నిరూపించుకుంటుంటారు క్రికెటర్లు. ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​ సెప్టెంబరు 19 నుంచి మొదలుకానుంది. ఈ సందర్భంగా లీగ్​లో నమోదైన ఐదు భారీ రికార్డులపై ఓ లుక్కేద్దాం. అయితే వీటిని భవిష్యత్తులో మరే ఆటగాడు అధిగమిస్తాడా అనేది సందేహంగా మారింది. ఆ రికార్డుల సమాహారమే ఈ కథనం.

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు

కెరీర్​లో ఎన్నో ఘనతలు సాధించి తన ఖాతాలో వేసుకున్నాడు వెస్టిండీస్​ విధ్వంసకర బ్యాట్స్​మన్​ క్రిస్​ గేల్​. 2013 సీజన్​లో ఇతడు నెలకొల్పిన రికార్డును మాత్రం ఇప్పటివరకు ఎవరు అధిగమించలేకపోయారు.

ఆ సీజన్​లో ఆర్సీబీ తరఫున పుణె వారియర్స్​పై కేవలం 66 బంతుల్లో 175 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఇందులో 13 బౌండరీలు, 17 సిక్స్​లు ఉన్నాయి. టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు. ​

gaelyuvaraj
గేల్​

కోహ్లీ ఎంతో ప్రత్యేకం

2016 సీజన్​ బెంగళూరు సారథి కోహ్లీకి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఆ ఏడాది విరాట్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. 16 ఇన్నింగ్స్​లోనే 81.08 స్ట్రైక్​రేట్​తో 973 పరుగులు చేశాడు. ఆ సీజన్​లో ఆరెంజ్​ క్యాప్​ను కూడా సొంతం చేసుకున్నాడు. ఒక సీజన్​లో ఇప్పటివరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. దీనిని ఇప్పట్లో ఎవరూ అందుకోలేకపోవచ్చు.

virat
విరాట్​కోహ్లీ

ఆశిశ్​ నెహ్రా.. ఔరా!

ఆశిష్​ నెహ్రా.. ఆధునిక క్రికెట్​లో సరికొత్త రికార్డును సృష్టించాడు. 2009 ఐపీఎల్​లో దిల్లీ డేర్​డెవిల్స్​కు ఆడూతూ ఓ మ్యాచులో 4 ఓవర్ల వేసి 1.5 ఎకానమీతో కేవలం 6 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తీశాడు.

ashish
ఆశిష్​

ఆరు బంతుల్లో 37 పరుగులు

బ్యాట్స్​మన్ ఓవర్​లోని ఆరు బంతుల్లో 37 పరుగులు చేయడం అసాధ్యం. కానీ సుసాధ్యం చేసి చూపించాడు గేల్​. 2011లో కొచీ టస్కర్స్​తో మ్యాచ్​లో దీనిని చేసి చూపించాడు. ఓవర్​లో భాగంగా నాలుగు సిక్సులు, మూడు ఫోర్లు కొట్టి 37 పరుగులతో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇందులో ఓ నోబాల్​కు సిక్స్​ కూడొ కొట్టాడు.

gael
గేల్​

డబుల్​ హ్యాట్రిక్​

టీమ్​ఇండియా స్టార్ బ్యాట్స్​మన్​ యువరాజ్​ సింగ్.. 2009​ సీజన్​లో డబుల్​ హ్యాట్రిక్​లు తీశాడు. ఆర్సీబీతో మ్యాచులో వరుస బంతుల్లో జాక్వెస్​ కల్లీస్​, రాబిన్​ ఉతప్ప, మార్క్​ బౌచర్​ను ఔట్​ చేశాడు. అనంతరం డెక్కన్​ ఛార్జర్స్​తో మ్యాచులోనూ గిబ్స్​, ఆండ్రూ సైమండ్స్​, వేణుగోపాల్​ రావ్​ను వరుసగా ఔట్ చేసి.. రెండు మ్యాచ్​ల్లో రెండు హ్యాట్రిక్​లు తీసిన ఘనత సాధించాడు.

yuvaraj
యువరాజ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.