ETV Bharat / sports

సతీసమేతంగా దుబాయ్​ వెళ్లిన ఐపీఎల్​ క్రికెటర్లు వీరే! - కుటంబంతో కలిసి ఐపీఎల్​

ఐపీఎల్​ కోసం కుటుంబంతో కలిసి దుబాయ్​ చేరుకున్న ఆటగాళ్లు చాలా సరదాగా గడుపుతున్నారు. ​ వారెవరు? ప్రస్తుతం ఏమి చేస్తున్నారు? వంటి విశేషాల గురించి తెలుసుకుందాం.

IPL 2020
ఐపీఎల్​ క్రికెటర్లు
author img

By

Published : Sep 2, 2020, 6:13 AM IST

ఐపీఎల్​ 13వ సీజన్​ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు క్రీడాభిమానులు. ఈ మెగా లీగ్​ కోసం ఇప్పటికే జట్లన్నీ దుబాయ్​ చేరుకోవడం సహా క్వారంటైన్​ పూర్తిచేసుకుని ప్రాక్టీసు కూడా మొదలుపెట్టేశాయి. అయితే టోర్నీలో పాల్గొనే క్రికెటర్లలో కొంతమంది తమ కుటుంబాలతో కలిసి యూఏఈకి వచ్చారు. మైదానంలో తమ జీవిత భాగస్వాములు బ్యాట్​, బంతితో విజృంభిస్తుంటే స్టాండ్స్​లో కూర్చొని ప్రత్యక్షంగా చూసి ఆనందించేందుకు ఆటగాళ్ల సతీమణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జంటగా వెళ్లిన ఆటగాళ్లు ఎవరు? వారు ఏమి చేస్తున్నారు? ఆ విశేషాలపై ఓ లుక్కేద్దాం.

రోహిత్​ శర్మ

ముంబయి ఇండియన్స్​ జట్టుకు నాలుగు సార్లు ఐపీఎల్​ టైటిల్​ అందించిన సారథి రోహిత్​ శర్మ. ఈ మెగాలీగ్​లో పాల్గొనేందుకు సతీసమేతంగా దుబాయ్​ చేరుకున్నాడీ ఆటగాడు. భార్య రితికా సింగ్​తో కసరత్తులు చేస్తూ, కూతురు సమైరాతో సినిమాలు చూస్తూ క్వారంటైన్​ సమయాన్ని ఎంజాయ్​ చేస్తునాడు. వాటికి సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తున్నాడు.

కోహ్లీ

సతీమణి, హీరోయిన్​ అనుష్క శర్మతో కలిసి క్వారంటైన్​లో సరదాగా గడుపుతున్నాడు ఆర్సీబీ సారథి విరాట్​ కోహ్లీ. కాగా ఈ జంట తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఇటీవలే అభిమానులకు తీపి కబురు అందించింది. దీంతో ఈ జోడీకి దుబాయ్​లో కేక్ కట్టింగ్​ పార్టీ ఇచ్చింది జట్టు యాజమాన్యం.

  • 7 days of quarantine in Bengaluru followed by 7 days in Dubai and 6 COVID tests later, the team finally got a chance to spend quality time together in a dedicated private beach and a state of the art team room, within the secure bio bubble.#PlayBold #IPL2020 #WeAreChallengers pic.twitter.com/UweXBqhjlv

    — Royal Challengers Bangalore (@RCBTweets) August 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ధావల్​ కుల​కర్ణి

ముంబయి ఇండియన్స్​ పేసర్ ధావల్​ కుల​కర్ణి.. భార్య శ్రద్ధా ఖర్పుడేతో కలిసి ఫిఫా మ్యాచ్​లను చూస్తూ, ఆడుతూ క్వారంటైన్​లో గడుపుతున్నాడు. రూమ్​లోనే భీకరమైన కసరత్తులు చేస్తున్నాడు.

సూర్యకుమార్​ యాదవ్​

ముంబయి ఇండియన్స్​ విధ్వంసకర బ్యాట్స్​మన్​ సూర్యకుమార్​ యాదవ్​ తన సతీమణి దేవిషా శెట్టితో దుబాయ్​ వాతావరణాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్నాడు.

suryakumar

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.