12వ ఐపీఎల్ సీజన్ అభిమానులకు వినోదాన్ని పంచుతోంది. కొన్ని జట్లు ఆశించిన ఫలితాలు సాధించక ఢీలా పడుతుంటే మరికొన్ని జట్లు అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో దూసుకెళుతున్నాయి. ఈ ప్లేఆఫ్ రేసులు దూసుకొస్తున్న తరుణంలో సీజన్లో మ్యాచ్ విన్నింగ్ అంశమైన బౌలింగ్‌లో ఏ జట్టు ఎన్ని మార్కులు సాధించిందో చూద్దాం....
చెన్నై సూపర్ కింగ్స్.. (9/10)
అవకాశాలను అందిపుచ్చుకోడంలో ధోని ఎప్పుడూ ముందుంటాడు. ఆటగాళ్లను రొటేషన్ చేస్తూ జట్టుకు విజయాలనందిస్తుంటాడు. ఈ సీజన్లోనూ చెన్నై బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా స్పిన్నర్లు ఆకట్టుకున్నారు. హర్భజన్, తాహిర్‌తో కూడిన స్పిన్ విభాగం 31 వికెట్లు సాధించింది. యువ బౌలర్ దీపక్ చాహర్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. సీజన్లో రెండో అత్యధిక డాట్ బాల్స్ వేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
![IPL 2019: Rating the bowling of the eight teams](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/3080323_ipl-4.jpg)
దిల్లీ క్యాపిటల్స్ (8.5./10)
బౌలింగ్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది దిల్లీ జట్టు. రబాడ ఇప్పటికే ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. పర్పుల్ క్యాప్ అందుకునే అవకాశం ఉంది. క్రిస్ మోరిస్, అక్షర్ పటేల్, కీమో పాల్లు కూడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఇషాంత్ శర్మ ఫామ్ జట్టుకు అదనపు బలం.
![IPL 2019: Rating the bowling of the eight teams](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/3080323_ipl-5.jpg)
ముంబయి ఇండియన్స్ (8/10)
పేస్ బౌలింగ్ మీద ఆధారపడుతోంది ముంబయి జట్టు. సారథి రోహిత్ శర్మ బౌలర్లను రొటేట్ చేస్తూ జట్టును గెలుపు బాట పట్టిస్తున్నాడు. బుమ్రా, మలింగ, బెహ్రండార్ప్, హార్దిక్ పాండ్య అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ జట్టు పేసర్లు 40 వికెట్లు తీసి ఆకట్టుకుంటున్నారు. స్పిన్నర్ రాహుల్ చాహర్‌తో పాటు కృనాల్ పాండ్య ప్రదర్శన ఈ జట్టుకు అదనపు బలం.
సన్ రైజర్స్ హైదరాబాద్ (7/10)
ఓపెనర్లు మినహాయిస్తే బ్యాటింగ్‌లో విఫలమవుతున్న సన్ రైజర్స్, బౌలింగ్‌లో కాస్త మెరుగైన ప్రదర్శనే కనబరుస్తోంది. అప్గాన్ స్టార్ బౌలర్లు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ స్థిరంగా రాణిస్తున్నారు. యువ బౌలర్లు సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్ ఆకట్టుకుంటున్నారు. భువనేశ్వర్ ఫామ్ లేమితో సతమతమవుతుండగా, ఖలీల్ అహ్మద్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు.
![IPL 2019: Rating the bowling of the eight teams](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/3080323_ipl_d.jpg)
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (6.5/10)
ఈ సీజన్లో చెప్పుకోదగ్గ ప్రదర్శననే కనబరుస్తోంది పంజాబ్. షమి బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేస్తూ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. సారథి అశ్విన్ కూడా రాణిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి ఇప్పటికే 23 వికెట్లు తీశారు. ఈ సీజన్లో హ్యాట్రిక్ తో చెలరేగిన యువ బౌలర్ సామ్ కరమ్ కూడా ఆకట్టుకుంటున్నాడు.
![IPL 2019: Rating the bowling of the eight teams](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/3080323_ipl-8.jpg)
కోల్‌కతా నైట్ రైడర్స్ (3.5/10)
స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఇబ్బందిపడుతోంది కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు. స్పిన్నర్లు అంతగా రాణించలేకపోవడం పెద్దలోటు. పేసర్లలో స్థిరమైన ప్రదర్శన లోపించింది.
![IPL 2019: Rating the bowling of the eight teams](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/3080323_ipl-3.jpg)
రాజస్థాన్ (3/10), బెంగళూరు (2.5/19)
బౌలింగ్ విభాగంలో రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ దారుణంగా విఫలమవుతున్నాయి. రాజస్థాన్‌లో శ్రేయస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్ ఫర్వాలేదనిపిస్తున్నారు. బెంగళూరు బౌలర్లు అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు. చాహల్, సైనీ మోస్తారుగా రాణిస్తున్నారు.
![IPL 2019: Rating the bowling of the eight teams](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/3080323_ipl-2.jpg)
ఇవీ చూడండి.. ప్లేఆఫ్ బెర్త్‌పై చెన్నై గురి... హైదరాబాద్‌తో పోరు