ETV Bharat / sports

ఐపీఎల్​ ప్రాక్టీసు కోసం ఎట్టకేలకు ఆ జట్టు సిద్ధం! - చెన్నై సూపర్​కింగ్స్ ఐపీఎల్

గురువారం జరిపిన కొవిడ్​ పరీక్షల్లో చెన్నై సూపర్​కింగ్స్​కు ఊరట లభించింది. పాజిటివ్ వచ్చిన ఇద్దరు క్రికెటర్ల మినహా మిగిలిన వారందరికీ నెగటివ్​గా తేలింది.

IPL 13: CSK to start training from today after no fresh COVID-19 case in camp
చెన్నై సూపర్ కింగ్స్
author img

By

Published : Sep 4, 2020, 11:18 AM IST

ఐపీఎల్​లో చెన్నై సూపర్​కింగ్స్​ జట్టుకు ఊరట లభించింది. ఇటీవలే వైరస్​ సోకిన జట్టులోని సిబ్బందికి క్వారంటైన్​ తర్వాత మరోసారి నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్​గా తేలింది. దీంతో శుక్రవారం నుంచి ఆటగాళ్లు ప్రాక్టీసు​ మొదలుపెట్టనున్నారు.

"చెన్నై సూపర్​కింగ్స్​ జట్టులో గురువారం జరిగిన కొవిడ్​ పరీక్షల్లో ఆటగాళ్లకు నెగటివ్​గా తేలింది. దీంతో శుక్రవారం నుంచి వారు ప్రాక్టీసు మొదలుపెడుతున్నారు. ఇటీవలే కరోనా సోకిన ఇద్దరు క్రికెటర్లు, 13 మంది సిబ్బందికి 14 రోజుల ఐసోలేషన్​ తర్వాత పరీక్షలు నిర్వహిస్తారు. అందులో వారికి నెగటివ్​గా నిర్ధరణ అయితే వారూ ప్రాక్టీసు సెషన్​లో పాల్గొనవచ్చు" అని సీఎస్కే అధికారి ఒకరు తెలిపారు.

చివరి ఫ్రాంఛైజీ ఇదే

చెన్నై సూపర్​కింగ్స్​ క్రికెటర్లకు వరుసగా మూడోసారి చేసిన కొవిడ్​ టెస్ట్​ల్లో నెగటివ్ వచ్చిన వారిని ప్రాక్టీసుకు అనుమతించారు. ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో ప్రాక్టీసు మొదలుపెట్టనున్న చివరి ఫ్రాంఛైజీ ఇదే. మరోవైపు లీగ్​ కోసం దుబాయ్​ వెళ్లిన బీసీసీఐ వైద్యబృందంలో ఓ వ్యక్తికి వైరస్​ సోకింది. ఈ విషయాన్ని బోర్డు ధ్రువీకరించింది.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్​ జరగనుంది. శుక్రవారం టోర్నీకి సంబంధించిన షెడ్యూల్​ విడుదల కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.