ETV Bharat / sports

'ఎవర్ని ఎలా ఔట్​ చేయాలో అశ్విన్​కు బాగా తెలుసు' - reinventing

టీమ్​ఇండియా స్పిన్​ ఆల్​రౌండర్​ అశ్విన్​.. తెలివైనవాడని ప్రశంసించాడు భారత మాజీ ఆటగాడు లక్ష్మణ్​. నిత్యం తనను తాను మెరుగుపరుచుకుంటాడని తెలిపాడు.

'Intelligent' Ashwin always reinventing himself, says Laxman
'అశ్విన్​ తెలివైన వ్యక్తి.. నిత్యం మెరుగవుతాడు'
author img

By

Published : Mar 2, 2021, 2:11 PM IST

టీమ్​ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్​ను ప్రశంసలతో ముంచెత్తాడు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్​ లక్ష్మణ్​. అతడొక తెలివైన వ్యక్తి.. తనను తాను నిత్యం మెరుగుపరుచుకుంటాడని లక్ష్మణ్​ అభినందించాడు.

ఒక వ్యక్తి ఉన్నత స్థితికి చేరడానికి నైపుణ్యం ఒక్కటే చాలదు. అందుకు సన్నద్ధత అవసరం.. ప్రణాళికను కచ్చితంగా అమలు చేయాలి. ఇది చాలా కష్టమైన విషయం. అశ్విన్ చాలా​ తెలివైన వ్యక్తి. అతడు బ్యాట్స్​మెన్ల బలహీనతలను గమనిస్తాడు. వారిని ఎలా ఔట్​ చేయాలనే విషయంపై ప్రణాళికలను రచించుకొని పక్కగా అమలు చేస్తాడు.

-వీవీఎస్ లక్ష్మణ్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్.

'ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్​లో స్టీవ్​ స్మిత్​తో పాటు ఇతర బ్యాట్స్​మెన్లను అశ్విన్ ఎలా ఇబ్బంది పెట్టాడో మనం చూశాం. అతడు ఎల్లప్పుడూ అత్యుత్తమంగా బౌలింగ్​ చేయాలని భావిస్తాడు' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: 'మ్యాన్​​ ఆఫ్ ది మ్యాచ్'కు పెట్రోల్​ బహుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.