ETV Bharat / sports

కివీస్​తో తొలిటెస్టుకు బాబర్​, ఇమామ్​​ దూరం - పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు వార్తలు

న్యూజిలాండ్​తో జరగనున్న తొలిటెస్టుకు పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​, ఓపెనర్​ ఇమామ్​-ఉల్​-హక్​లు అందుబాటులో ఉండరని పాక్​ క్రికెట్​ బోర్డు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గాయాల కారణంగా కెప్టెన్​కు విశ్రాంతి అవసరమైన క్రమంలో బాక్సింగ్​డే టెస్టుకు మహ్మద్​ రిజ్వాన్​కు జట్టు పగ్గాలు అప్పగించినట్లు తెలిపింది.

Injured Babar Azam, Imam-ul-Haq ruled out of first Test against NZ
న్యూజిలాండ్​​తో తొలిటెస్టుకు బాబర్​, ఇమామ్​లు​ దూరం
author img

By

Published : Dec 21, 2020, 1:38 PM IST

న్యూజిలాండ్​తో జరగనున్న తొలిటెస్టుకు పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​, ఓపెనర్​ ఇమామ్​-ఉల్​-హక్​ అందుబాటులో ఉండట్లేదు. గాయాల కారణంగా తొలిటెస్టులో వీరిద్దరూ ఆడరని పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు సోమవారం ప్రకటించింది. కివీస్​, పాక్​ మధ్య డిసెంబరు 26 నుంచి బాక్సింగ్​డే టెస్టు ప్రారంభం కానుంది.

గతవారం క్వీన్స్​టౌన్​లో ప్రాక్టీసులో పాల్గొన్న బాబర్ అజామ్​కు కుడి బొటనవేలికి గాయం కాగా.. ఇమామ్​కు ఎడమ చేతి బొటనవేలికి గాయమైందని పాక్​ బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం బాబర్​​, ఇమామ్​ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తిరిగి ఎప్పుడు నెట్స్​లో అడుగుపెడతారనే దానిపై మాత్రం బోర్డు స్పష్టతనివ్వలేదు.

తొలిటెస్టుకు బాబర్​ అందుబాటులో లేని కారణంగా అతడి స్థానంలో మహ్మద్​ రిజ్వాన్​కు జట్టు పగ్గాలను అప్పగించారు. దీంతో రిజ్వాన్​ పాకిస్థాన్​ టెస్టు జట్టుకు 33వ కెప్టెన్​గా ఎంపికయ్యాడు. మరోవైపు ఆ జట్టు​ ఫస్ట్​క్లాస్​ ఆటగాడు ఇమ్రాన్​ భట్​కు తొలిటెస్టు ఆడే అవకాశం వచ్చింది. క్వాయిడ్​-ఇ-అజామ్ ట్రోఫీలో మూడు ఫస్ట్​క్లాస్​ మ్యాచ్​లు అడిన ఇమ్రాన్​ భట్​ 191 పరుగులు చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో ఎక్స్​ట్రా ప్లేయర్​గా ఎంపికయ్యాడు.

పాకిస్థాన్​ టెస్టు స్క్వాడ్​: మహ్మద్​ రిజ్వాన్​ (తొలి టెస్టుకు కెప్టెన్), అబిద్ అలీ, అజార్​ అలీ, ఫహీమ్​ అష్రఫ్​, ఫవాద్​ ఆలం, హరిస్​ సోహైల్​, ఇమ్రాన్​ భట్​, మహ్మద్​ అబ్బాస్​, నసీమ్​ షా, సర్ఫరాజ్​ అహ్మద్​, షాదాబ్​ ఖాన్​, షాహీన్​ అఫ్రిది, షాన్​ మసూద్​, సోహైల్​ ఖాన్​, యాసిర్​ షా. (తొలిటెస్టుకు బాబర్​ అజామ్​, ఇమామ్​-ఉల్​-హక్ అందుబాటులో ఉండరు)

ఇదీ చూడండి: 'సిరీస్​ పూర్తయ్యాకే పృథ్వీకి సూచనలిస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.