టీమ్ఇండియా వైస్‌కెప్టెన్ అజింక్య రహానె మైదానంలో చాలా ప్రశాంతంగా కనిపిస్తుంటాడు. ఎంత ఒత్తిడిలో ఉన్నా కూల్‌గా బ్యాటింగ్ చేస్తుంటాడు. కోహ్లీ గైర్హాజరీలో జట్టును అద్భుతంగా నడిపించి గొప్ప నాయకుడిగా ప్రశంసలు దక్కించుకున్నాడు. అయితే ఇంగ్లాండ్ పర్యటన కోసం చెన్నైలో బయోబబుల్‌లో ఉన్న రహానె.. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో కాస్త సమయాన్ని గడిపాడు. అభిమానులు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. అవి ఏంటో మీరూ చదివేయండి!
- మిసాల్/ వడాపావ్.. ఏది ఇష్టం?
కఠినమైన ప్రశ్న. వడాపావ్
- యువ ఆటగాళ్లు నటరాజన్, సిరాజ్, శుభ్‌మన్ గిల్, సుందర్ గురించి చెప్పండి?
వాళ్లకి ఫలితం గురించి భయంలేదు. జట్టు కోసం అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ఆలోచిస్తారు. ఆటపై అంకిత భావంతో, భయంలేని క్రికెట్ ఆడుతున్నారు.
- చెన్నైకి స్వాగతం. తమిళంలో ఏదైనా సినిమా/వెబ్‌సిరీస్ చూశారా?
సూర్య నటించిన 'సూరరై పోట్రూ' (ఆకాశం నీ హద్దురా) చూశాను. ఎంతో నచ్చింది.
- మెల్‌బోర్న్‌లో శతకం సాధించిన తర్వాత ఎలా సంబరాలు చేసుకున్నారు?
వర్చువల్ సెలబ్రేషన్స్. నా భార్య, కూతురుతో వీడియో కాల్ మాట్లాడాను.
- ఆస్ట్రేలియా జట్టులో ఎవరు ఎక్కువగా కవ్వించేవారు?
ఆసీస్ జట్టులో అందరూ ఎంతో మర్యాదస్తులు (నవ్వుతున్న ఎమోజీ).
- క్రికెట్ ఆడని సమయాల్లో మీరేం చేస్తుంటారు?
సంగీతాన్ని ఆస్వాదిస్తా.
- ఫేవరేట్ సాంగ్?
'లక్ష్య' సినిమాలోని 'కందోన్ సె మిల్తే హై కందే'.
- కరోనా విజృంభించిన తర్వాత ఎన్నాళ్లకు తిరిగి క్రికెట్ ఆడారు?
దాదాపు ఆరు నెలలు. దిల్లీ క్యాపిటల్స్ ఏర్పాటు చేసిన శిబిరంలో ఆడా.
- రోహిత్ శర్మ గురించి చెప్పండి?
రోహిత్ నా సోదరుడు లాంటి వాడు. అతడితో సంభాషణ ఎంతో బాగుంటుంది.
- రూమ్‌లో ఏం చేస్తుంటారు?
అప్పుడు కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తా.
- మెల్‌బోర్న్‌లో నచ్చిన ప్రదేశం?
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ).
- వివ్ రిచర్డ్సన్‌తో మాట్లాడిన సందర్భం గురించి ఒక్క మాటలో చెప్పండి?
నాకు దక్కిన గొప్ప గౌరవం.
- మీ భార్య (రాధిక)ను ఎలా కలిశారు?
ఒకే ప్రాంతంలో ఉండేవాళ్లం. ఆమె నా సోదరి స్నేహితురాలు.
ఇదీ చూడండి: