ETV Bharat / sports

'ప్లాన్​ బీ లేకపోవడమే టీమ్​ఇండియాకు శాపం!' - ధోనీ

టీమ్​ఇండియా సెలక్షన్ ప్రక్రియలో ప్లాన్​ 'బీ' లేకపోవడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ నాసర్​ హుస్సేన్. టాపార్డర్​ బాగున్నా.. అది విఫలమైన పక్షంలో మిడిలార్డర్​​లో నిలకడ లేదని తాజాగా వెల్లడించాడు. జట్టు ఎంపిక చేసుకునే క్రమంలో మరో ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించాడు.

India's selection in ICC meets have gone wrong, need plan B: Nasser Hussain
'ప్లాన్​ 'బీ' లేకపోవడమే టీమ్​ఇండియాకు శాపం!'
author img

By

Published : Jul 6, 2020, 4:18 PM IST

ఐసీసీ ప్రధాన టోర్నీల్లో భారత జట్టుకు ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదని ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ నాసర్​ హుస్సేన్​ అభిప్రాయపడ్డాడు. టాపార్డర్ విఫలమైతే​ మిడిలార్డర్​లో సత్తా చాటే ఆటగాళ్లు కనిపించడం లేదని అన్నాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్​ 2014 (యువరాజ్​ సింగ్​ దూరమయ్యాడు), 2017 ఛాంపియన్స్​ట్రోఫీ, 2019 ప్రపంచకప్​లలో టాపార్డర్​ పతనంతో జట్టు విఫలమైంది. ఎందుకంటే జట్టుకు బ్యాటింగ్​ లైనప్​ చాలా ముఖ్యమైనది. ఇదే విషయంపై తాజాగా స్పందించాడు నాసర్ హుస్సేన్.

"ఐసీసీ ప్రధాన టోర్నీల కోసం జరుగుతున్న భారత జట్టు ఎంపికలో ఏదో తప్పు దొర్లుతుంది. పరిస్థితులకు అనుగుణంగా జట్టు కూర్పు చేయడంలో విఫలమవుతున్నారు. ఇది కేవలం ఒక గేమ్​ ప్లాన్ గురించి​ మాత్రమే కాదు. 2019 ప్రపంచకప్​లో న్యూజిలాండ్​తో జరిగిన సెమీస్​లో కోహ్లీ, రోహిత్​ శర్మ ఔటైన తర్వాత మిడిలార్డర్​ విఫలమవ్వడం టీమ్​ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ. ప్లాన్​ 'ఏ' కలిగి ఉండటమే కాకుండా టాపార్డర్​ విఫలమైన తరుణంలో ప్లాన్​ 'బీ'ని అమలు చేయడానికి ముందుగానే సంసిద్ధం అవ్వాలి".

- నాసర్​ హుస్సేన్​, ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీతో పోల్చుకుంటే కోహ్లీ ప్రతిభావంతుడైనా.. మహీకి ప్రత్యామ్నాయం కాలేకపోయాడని అభిప్రాయపడ్డాడు నాసర్​ హుస్సేన్​. కొన్ని విషయాల్లో కోహ్లీ మెరుగవ్వాలని తెలిపాడు.

టీమ్​ఇండియా ఎన్నో విషయాల్లో గొప్పగా ఉన్నప్పటికీ.. జట్టు ఎంపిక అంశంలో తప్పు చేస్తుందని భావించడం లేదని వెల్లడించాడు నాసర్​. జట్టులో నాలుగో స్థానంపై నిలకడ కలిగిన క్రికెటర్​ లేకపోవడంపై విచారాన్ని వ్యక్తం చేశాడు. ఈ అంశం జట్టు విజయాలను ప్రభావితం చేస్తుందని అన్నాడు​ హుస్సేన్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.