షఫాలీ వర్మ.. ప్రస్తుతం భారత మహిళా క్రికెట్లో మార్మోగుతున్న పేరు. వయసేమో 15 కానీ ఆట మాత్రం విధ్వంసమే. సెహ్వాగ్ తరహా దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటోంది. దేశవాళీ మ్యాచ్‌ల్లో 150పైగా స్ట్రయిక్ రేటు నమోదు చేసింది. విదేశీ గడ్డపై ఆదివారం ఆడిన తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయింది. కరీబియన్ దీవుల్లో తనదైన బ్యాటింగ్‌తో సునామీ సృష్టించింది.
వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో.. వేగంగా అర్ధశతకం చేసింది షఫాలీ. ఈ ఘనత సాధించిన పిన్న భారతీయురాలిగా (15 ఏళ్ల 285 రోజులు) రికార్డు సృష్టించింది. ఓవరాల్‌గా రెండో క్రీడాకారిణిగా నిలిచింది. యూఏఈకి చెందిన ఎగోడాగ్ (15 ఏళ్ల 267 రోజులు) తొలి స్థానంలో ఉంది. 30 ఏళ్ల క్రితం భారత దిగ్గజం సచిన్ తెందూల్కర్ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసింది.
-
The explosive 15-year-old Shafali Verma scored her maiden half-century in the first T20I against West Indies Women today in St Lucia. Shafali is the youngest Indian ever to score an int'l fifty👏🏾👏🏾 #TeamIndia pic.twitter.com/O2MfVdNBOv
— BCCI Women (@BCCIWomen) November 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The explosive 15-year-old Shafali Verma scored her maiden half-century in the first T20I against West Indies Women today in St Lucia. Shafali is the youngest Indian ever to score an int'l fifty👏🏾👏🏾 #TeamIndia pic.twitter.com/O2MfVdNBOv
— BCCI Women (@BCCIWomen) November 10, 2019The explosive 15-year-old Shafali Verma scored her maiden half-century in the first T20I against West Indies Women today in St Lucia. Shafali is the youngest Indian ever to score an int'l fifty👏🏾👏🏾 #TeamIndia pic.twitter.com/O2MfVdNBOv
— BCCI Women (@BCCIWomen) November 10, 2019
ఆరంభం నుంచే అదుర్స్..
అనుభవం, వయసు తక్కువ క్రీడాకారిణులు క్రీజులో దిగిన వెంటనే నిలదొక్కుకోవడానికి కాస్త సమయం తీసుకుంటారు. కానీ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షఫాలీ... 75 మ్యాచ్‌ల అనుభవం ఉన్న స్టార్ బౌలర్ షకీరా సెల్మన్ను అలవోకగా ఎదుర్కొంది. మొదటి ఓవర్లోనే రెండు బౌండరీలు, సిక్సర్ బాదేసింది. మరో బౌలర్ హెన్రీ వేసిన ఓవర్లో నాలుగు ఫోర్లు, సిక్సర్‌తో 26 పరుగులు సాధించింది. ఈ విధ్వంసానికి 4 ఓవర్లలో భారత్ స్కోరు 60కి చేరింది. కేవలం 15 బంతుల్లోనే 40 పరుగులు చేసి అబ్బురపరిచింది షఫాలీ. చివరికు 30 బంతుల్లో తన కెరీర్లో మొదటి అర్ధశతకం సాధించింది. మొత్తం 49 బంతుల్లో 73 పరుగులు (6 ఫోర్లు, 4 సిక్సర్లు)చేసి ఔటయింది.

మెరిసిన స్మృతి
గాయం నుంచి కోలుకొని మైదానంలో అడుగుపెట్టిన స్మృతి మంధానా.. వరుసగా రెండో అర్ధశతకం ఖాతాలో వేసుకుంది. 46 బంతుల్లో 67 పరుగులు(11 ఫోర్లు) చేసి ఆకట్టుకుంది.
వీరిద్దరి జోరుకు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది మహిళా టీమిండియా. మొత్తం స్కోరులో షఫాలీ-మంధానా చేసినవే 143 పరుగులు కావడం విశేషం. వెస్టిండీస్‌పై అత్యధిక భాగస్వామ్య రికార్డూ వీరి పేరిటే చేరింది. విండీస్ బౌలర్లలో అనీషా మహ్మద్, షకీరా చెరో రెండు వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ షఫాలీకి దక్కింది.

భారీ లక్ష్య ఛేదనలో 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది వెస్టిండీస్. విండీస్ కీపర్ క్యాంప్‌బెల్ మాత్రమే 33 రన్స్ చేసి పర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో శిఖ పాండే, రాధా యాదవ్, పూనమ్ యాదవ్ చెరో రెండేసి వికెట్లు తీశారు. ఫలితంగా 84 పరుగుల తేడాతో విజయం సాధిచి... ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది భారత జట్టు.