దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత టెస్టు ఆడేందుకు టీమ్ఇండియా మహిళా జట్టు సిద్ధమైంది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న మన అమ్మాయిలు.. టెస్టుతో ఈ టూర్‌ను ప్రారంభించనున్నారు. దీనితో పాటే వన్డే, టీ20ల్లోనూ తలపడనున్నారు. 2014లో చివరగా టెస్టు ఆడింది భారత మహిళా బృందం.
పర్యటన షెడ్యూల్:
జూన్ 16-19 మధ్య ఏకైక టెస్టు, బ్రిస్టల్ కంట్రీ గ్రౌండ్ వేదికగా జరగనుంది. అనంతరం జున్ 27, 30, జులై 3 తేదీల్లో మూడు వన్డేలు.. జులై 9, 11, 15 తేదీల్లో మూడు టీ20లు ఆడనున్నాయి ఇరుజట్లు.
ఇది చదవండి: 'ఆసియా కప్' మళ్లీ వాయిదా.. 2022లోనే!