ఫిబ్రవరి 5న ప్రారంభం కానున్న భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు.. ముగ్గురు భారత అంపైర్లను ప్రకటించింది బీసీసీఐ. ఈ సిరీస్ ద్వారా ఐసీసీ ప్యానల్ అంపైర్లైన వీరేందర్ శర్మ, అనిల్ చౌదరి.. సుదీర్ఘ ఫార్మాట్లో ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా అరంగ్రేటం చేయనున్నారు.
ఇండియన్ ఎలీట్ ప్యానెల్ ప్రతినిధి నితిన్ మేనన్ కూడా ఐసీసీ ప్యానల్లో భాగం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈయన గత మ్యాచ్‌లో ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా పనిచేశారు.
కొవిడ్ నిబంధనల కారణంగా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోని మ్యాచ్‌లకు ఆతిథ్య దేశ అంపైర్లను.. ఐసీసీ అంగీకరించింది.
ముందుగా తమిళనాడుకు చెందిన సుందరం రవికి అవకాశం రావాల్సి ఉండగా.. టెస్టుల్లో సరైన పనితీరు ప్రదర్శించిన కారణంగా అతణ్ని ప్యానల్ నుంచి తప్పించారు. దీంతో మేనన్‌కు మార్గం సుగమమైంది. ఇప్పటివరకు ఈయన మూడు టెస్టులతో పాటు 24 వన్డేలకు, 16 టీ20లకు అంపైర్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది.
వీరేందర్ శర్మ ఒక టీ20తో పాటు రెండు వన్డేలకు అంపైర్‌గా పనిచేయగా.. చౌదరి 20 వన్డేలు, 28 టీ20లకు ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించారు.
ఇదీ చదవండి: పంత్‌ను ఆట పట్టిస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే?