ETV Bharat / sports

'పంత్ కూడా​ ఆడకపోతే ఏం చేస్తారు'

సాహాను పక్కనపెట్టి పంత్​కు అవకాశం ఇవ్వడాన్ని మాజీ క్రికెటర్​​ గంభీర్​ తప్పుబట్టాడు. ఒకవేళ పంత్​ కూడా విఫలమైతే మళ్లీ సాహాను తీసుకుంటారా? అని జట్టు​ యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. ఒకే సిరీస్​లో ఇద్దరు వికెట్ కీపర్లను ఎంపిక చేయడం సముచితంగా లేదని అభిప్రాయపడ్డాడు.

Indian team management has been unfair to both Saha and Pant: Gambhir
'సాహా, పంత్​ విషయంలో యాజమాన్యం సరిగా లేదు'
author img

By

Published : Dec 25, 2020, 8:39 PM IST

ఆస్ట్రేలియాతో బాక్సింగ్​ డే టెస్టులో ఆడనున్న టీమ్​ఇండియా జట్టుపై మాజీ క్రికెటర్​ గౌతమ్ గంభీర్​ తీవ్రంగా స్పందించాడు. వృద్ధిమాన్​ సాహాకు వికెట్​ కీపర్​గా ఒక్క మ్యాచ్​లో అవకాశం ఇచ్చి రెండో మ్యాచ్​లో తప్పించడాన్ని తప్పుబట్టాడు. పంత్​ ప్రదర్శన కూడా సరిగా లేకపోతే మళ్లీ సాహాను జట్టులోకి తీసుకుంటారా? అని జట్టు యాజమాన్యాన్ని ప్రశ్నించాడు.

"ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​లో​ సాహా.. కేవలం ఒకేఒక్క మ్యాచ్​ ఆడాడు. అయితే తొలి మ్యాచ్​లో అనుకున్నంతలో రాణించని కారణంగా అతడిని బాక్సింగ్​ డే టెస్టుకు పక్కన పెట్టేశారు. సాహా స్థానంలో​ పంత్​ను జట్టులోకి తీసుకున్నారు. ఒకవేళ పంత్​ కూడా రాబోయే మ్యాచ్​లో సరిగా ఆడకపోతే.. అప్పుడు ఏం చేస్తారు? మూడో టెస్టులోనూ పంత్​ సరైన ప్రదర్శన చేయకపోతే మళ్లీ​ సాహాను జట్టులోకి తీసుకుంటారా?"

- గౌతమ్​ గంభీర్​, టీమ్ఇండియా మాజీ క్రికెటర్​

సాహాను తప్పించి పంత్​కు అవకాశం ఇవ్వడం పట్ల జట్టు యాజమాన్యం తీరు తనకు అర్థం కావడం లేదని గంభీర్​ అన్నాడు. "సాహా స్థానంలో పంత్​ను ఎంపిక చేయడం కరెక్ట్​ కాదు. సిరీస్​ కోసం వీరిద్దరిని ఎంపిక చేసుకుని, పరిస్థితులను బట్టి జట్టులో వికెట్​ కీపర్ల మార్పు సరైనది కాదు. ఇలాంటి మార్పులు బౌలింగ్​లో చేయొచ్చు. విదేశీ గడ్డపై సిరీస్​ల కోసం జట్టులో కనీసం ఇద్దరు స్పిన్నర్లను ఎంపిక చేసుకోవడం సహజం. దాన్ని అర్థం చేసుకోగలం. కానీ, వృద్ధిమాన్​ కేవలం స్వదేశంలోనే రాణించగలడని.. పంత్​ విదేశాల్లో పనికొస్తాడనే విషయాన్ని అసలు నమ్మను. స్వదేశంలోనూ రాణిస్తే, విదేశాల్లో జరిగే సిరీస్​ల్లోనూ కచ్చితంగా రాణించాల్సి ఉంటుంది. ఒకవేళ అలా ఏ ఆటగాడు చేయకపోతున్నాడనే వాదన అసంబద్ధం" అని గంభీర్​ అన్నాడు.

ఇదీ చూడండి: గిల్​, సిరాజ్ అరంగేట్రం.. రెండో టెస్టుకు జట్టిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.