కరోనా ప్రభావంతో క్రీడారంగం కుదేలైపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని టోర్నీలు, పర్యటనలు రద్దయ్యాయి. క్రికెట్ మ్యాచ్‌లు, ప్రాక్టీస్ సెషన్స్ లేకపోవడం వల్ల ఆటగాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయంలో క్రికెటర్లు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. నెటిజన్లతో కలిసి పలు విషయాలు చర్చిస్తున్నారు. తాజాగా ఐసీసీ చేసిన పోస్ట్‌పై టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ స్పందిచడం వైరల్‌గా మారింది.
" మీ అభిప్రాయం ప్రకారం ఫుల్‌షాట్ ఆడే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరు?" అంటూ ఓ ఫొటో షేర్ చేసింది ఐసీసీ. ఆ ఫొటోలో వివియన్ రిచర్డ్స్, రికీ పాంటింగ్, హెర్షల్ గిబ్స్‌లతో పాటు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఉన్నారు.
అయితే ఐసీసీ పోస్ట్‌కు స్పందించిన రోహిత్.. "ఇక్కడ ఎవరో తప్పిపోయారా? ఇంటి నుంచి పనిచేయడం అంత సులభం కాదు" అంటూ సమాధానమిచ్చాడు. అయితే అది ఎవరనేది మాత్రం చెప్పలేదు. అయితే ఈ ట్వీట్ వైరల్ కావడం వల్ల పుల్‌షాట్ ఆడటంలో 'రోహిత్ శర్మ ది బెస్ట్' అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
-
Someone’s missing here ?? Not easy to work from home I guess https://t.co/sbonEva7AM
— Rohit Sharma (@ImRo45) March 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Someone’s missing here ?? Not easy to work from home I guess https://t.co/sbonEva7AM
— Rohit Sharma (@ImRo45) March 22, 2020Someone’s missing here ?? Not easy to work from home I guess https://t.co/sbonEva7AM
— Rohit Sharma (@ImRo45) March 22, 2020
సమాధానం దొరికింది:
రోహిత్ ట్వీట్‌కు స్పందిస్తూ ఐసీసీ మళ్లీ ఓ ట్వీట్ చేసింది. అందులో " రోహిత్ నిజాయితీగల ఆటగాడు" అంటూ తాను ఆడిన పుల్‌షాట్ కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. అంటే అందులో తప్పిపోయిన వారు రోహిత్ శర్మనే అని ఐసీసీ ఈ రకంగా చెప్పింది.
-
Fair play, Rohit. pic.twitter.com/SGWtRajPwk
— ICC (@ICC) March 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Fair play, Rohit. pic.twitter.com/SGWtRajPwk
— ICC (@ICC) March 22, 2020Fair play, Rohit. pic.twitter.com/SGWtRajPwk
— ICC (@ICC) March 22, 2020
తాజా పోస్ట్‌పై టీమిండియా సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ... రోహిత్, పాంటింగ్‌ల పేరును జతచేశాడు. కెవిన్ పీటర్సన్, రికీ పాంటింగ్‌లు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఆండ్రూ హడ్సన్ పేరును ట్యాగ్ చేశారు.