ETV Bharat / sports

కోట్లు పెట్టి కొంటే కోటి ఆశలు కల్పిస్తున్నారు..! - ipl auction 2020

ఐపీఎల్ 13వ సీజన్​లో చోటు దక్కించుకున్న విదేశీ ఆటగాళ్లు.. బిగ్​బాష్​ లీగ్​లో దుమ్ములేపుతున్నారు. కోట్లు పెట్టుకున్న ఫ్రాంఛైజీలకు కోటి ఆశలు కల్పిస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంకానున్న ఐపీఎల్​ ముంగిట వీరి ప్రదర్శన ఓసారి చూద్దామా..

indian premier league foreign players in bigbash league 2019
కోట్లు పెట్టి కొంటే కోటి ఆశలు కల్పిస్తున్నారు..!
author img

By

Published : Dec 22, 2019, 6:33 AM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు.. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్​బాష్​ లీగ్​లో సత్తా చాటుతున్నారు. ఐపీఎల్ వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న క్రికెటర్లు ఈ లీగ్ తొలి మ్యాచ్​లో అదరగొట్టేశారు. మరికొందరు మాత్రం కాస్త నిరాశపరిచారు. డిసెంబర్​ 17న ప్రారంభమైన ఈ టోర్నీలో.. ఇప్పటికి 6 మ్యాచ్​లు జరిగాయి. అందులో ఐపీఎల్​లో పాల్గొననున్న ఆటగాళ్ల ప్రదర్శనను ఓసారి చూద్దాం.

టామ్‌ బాంటన్‌.. (1 కోటి), కోల్​కతా

ఇంగ్లాండ్​ టెస్టు క్రికెట్​లో బ్యాటింగ్​తో సంచలనం రేపిన టామ్​ బాంటన్​.. ఐపీఎల్​ వేలంలో కోటి రూపాయలు పలికాడు. ఊహించని రీతిలో అతడిని భారీ ధరకు సొంతం చేసుకుంది కోల్​కతా నైట్​రైడర్స్​. అయితే ప్రస్తుతం జరుగుతున్న బిగ్​ బాష్​ లీగ్​లో అరంగేట్రంలోనే సత్తా చాటుతున్నాడు. బ్రిస్బేన్​ హీట్​ తరపున ఆడుతోన్న టామ్​.. మెల్​బోర్న్​ స్టార్స్​తో జరిగిన తొలి మ్యాచ్​లో అర్ధశతకం చేశాడు. 36 బంతుల్లో 64 రన్స్​ సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

మిచెల్​ మార్ష్​.. (2 కోట్లు), హైదరాబాద్​

ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఆల్​రౌండర్​ ప్రస్తుతం పెర్త్​ స్కాచర్స్​ తరఫున ఆడుతున్నాడు. ఈ లీగ్​లో తొలి మ్యాచ్​లో 22 బంతుల్లో 56 రన్స్​ చేశాడు. ఇందులో ఒక ఫోర్​, 6 సిక్సర్లు ఉన్నాయి. 254.55 స్ట్రయిక్​ రేటుతో పరుగులు చేశాడు. ఇతడిని రూ. 2 కోట్లకు దక్కించుకుంది సన్​రైజర్స్​ హైదరాబాద్​.

కేన్​ రిచర్డ్​సన్.. (4 కోట్లు), బెంగళూరు

ఆసీస్​కు చెందిన ఈ బౌలర్​.. మెల్​బోర్న్​ రెనిగేడ్స్​ తరఫున ఆడుతున్నాడు. ఆరంభ మ్యాచ్​లో 4 వికెట్లు తీశాడు. 5.50 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. ఇతడిని 4 కోట్ల ధర వెచ్చించి కొనుక్కుంది రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు.

క్రిస్‌ జోర్డాన్‌.. (3 కోట్లు), పంజాబ్​

ఇంగ్లాండ్​కు చెందిన ఆల్​రౌండర్ జోర్డాన్​.. పెర్త్​ స్కాచర్స్ తరఫున తొలి మ్యాచ్​ ఆడాడు. ఇందులో రెండు వికెట్లు తీయడమే కాకుండా అద్భుతమైన ఫీల్డింగ్​తో 3 క్యాచ్​లు పట్టి ఆకట్టుకున్నాడు. ఇతడిని రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​.

మ్యాక్స్​వెల్​.. (10.75 కోట్లు), పంజాబ్​

ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌.. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఫ్రాంచైజీకి, అభిమానులకు ఆనందం కలిగించాడు. వేలంలో రూ.10.75 కోట్ల ధర దక్కించుకున్న మరుసటి రోజే విధ్వంసం సృష్టించాడు. బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు ఆడుతున్న అతడు 39 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. మొత్తం 7 బౌండరీలు, 5 సిక్సర్లు బాదేశాడు. తాజాగా జరిగిన వేలంలో రెండో అత్యంత భారీ ధర పొందిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

టామ్​ కరన్​...

ఇంగ్లాండ్​కు చెందిన ఈ బౌలింగ్​ ఆల్​రౌండర్​ బిగ్​బాష్​ లీగ్​లో సిడ్నీ సిక్సర్స్​ తరఫున ఆడుతున్నాడు. జట్టు ఆరంభ మ్యాచ్​లో మూడు వికెట్లతో రాణించాడు. అయితే ఈ మ్యాచ్​లో 8 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు.

indian premier league foreign players in bigbash league 2019
టామ్​ కరన్​
  • లీగ్​లో సత్తా చాటాల్సివాళ్లు...

ఈ లీగ్​లో ఆడుతున్న కొంత మంది ఆటగాళ్లు ఐపీఎల్​లో భారీ ధర పలికినా ఆరంభ మ్యాచ్​లో నిరాశపర్చారు. మరి వీరిపై ఫ్రాంఛైజీలు చాలా ఆశలు పెట్టుకున్నాయి.

ఫించ్​.. (4.40 కోట్లు) ఆర్సీబీ

ఆసీస్​ విధ్వంసకర బ్యాట్స్​మన్​ ఆరోన్​ ఫించ్​ను భారీ ధరకు కొనుక్కొంది రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు. అయితే బిగ్​బాష్​లో మెల్​బోర్న్​ రెనిగేడ్స్​ తరఫున ఆడుతున్న ఇతడు.. ఆరంభ మ్యాచ్​లో పెద్దగా ఆకట్టుకోలేదు. 22 బంతుల్లో 29 పరుగులే చేశాడు.

క్రిస్​ లిన్​.. (2 కోట్లు) ముంబయి

ఈ ఆసీస్​ బ్యాట్స్​మన్​ను వేలంలో 2 కోట్లకు కొనుక్కుంది ముంబయి జట్టు. బ్రిస్బేన్​ హీట్​ తరఫున ఆడుతున క్రిస్​ లిన్​.. ఆరంభమ్యాచ్​లో పెద్దగా రాణించలేదు. 9 బంతుల్లో 9 పరుగులే చేశాడు. ఇతడి నిలకడ లేమి కారణంగా గత ఐపీఎల్​ యాజమాన్యం కోల్​కతా ఇతడిని అట్టిపెట్టుకోలేదు.

మార్కస్​ స్టొయినిస్.. (4.5 కోట్లు), దిల్లీ

మెల్​బోర్న్​ స్టార్స్​ తరఫున ఆడుతున్న ఈ ఆల్​రౌండర్​... 19 బంతుల్లో 16 రన్స్​ చేశాడు. బౌలింగ్​ అవకాశం రాలేదు. అయితే ఇతడిని రూ. 4.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది దిల్లీ క్యాపిటల్స్​.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
Amari Air Base, Harjumaa - 21 December 2019
1. UK Prime Minister Boris Johnson exiting car, greeting Estonian Prime Minister Juri Ratas, Ratas greeting UK ambassador to Estonia Theresa Bubbear, Johnson and Ratas walking past soldiers and going inside
2. Various of British soldiers lining up to eat, eating
STORYLINE:
UK Prime Minister Boris Johnson visited British troops stationed at an air base in Estonia on Saturday.
Johnson was expected to serve Christmas lunch to the soldiers during the one-day visit.
He was greeted on arrival by Estonian Prime Minister Juri Ratas.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.