మనిషికి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అనే ప్రశ్నకు చాలా మంది ఇచ్చే సమాధానం 'శునకం'. ఎందుకంటే కుక్క ఒక్కసారి మనిషిని నమ్మితే.. జీవితాంతం విశ్వాసం చూపిస్తుంది. ఎలాంటి ఆపదల్లోనైనా మనకు తోడుగా ఉంటుంది. అందుకే పెంపుడు జంతువుగా చాలా మంది దీనినే ఎంచుకుంటారు. టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.. ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ముద్దుగా 'అలెక్సో' అని పిలుచుకుంటాడు భువీ. దాని చిన్నతనం నుంచి అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. తాజాగా దానితో తన స్నేహానికి గుర్తుగా ఉన్న ఓ ఫొటోను ఇన్స్టాలో పంచుకున్నాడు. "స్నేహితులు ఒకప్పుడు, ఇప్పుడు" అనే వ్యాఖ్యను జోడించాడు.
రెండు చిత్రాలను గమనిస్తే.. గతంతో పోలిస్తే అలెక్స్ బొద్దుగా తయారయినట్లు కనిపిస్తోంది. రెండు ఫొటోల్లోనూ ఒకే ఫోజులో ఉన్న భువి, అలెక్సోల ఎక్స్ప్రెషన్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే దాదాపు 3.5లక్షల మందికిపైగా ఈ ఫొటోను లైక్ చేయగా.. 1000కి పైగా కామెంట్లు వచ్చాయి.
ఇదీ చూడండి : కోహ్లీ, రోహిత్ నాకు పెద్దన్నల్లాంటి వారు: చాహల్
-
Buddies THEN and NOW!! 🐶🦮 pic.twitter.com/lNN6Pl3Lyt
— Bhuvneshwar Kumar (@BhuviOfficial) June 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Buddies THEN and NOW!! 🐶🦮 pic.twitter.com/lNN6Pl3Lyt
— Bhuvneshwar Kumar (@BhuviOfficial) June 5, 2020Buddies THEN and NOW!! 🐶🦮 pic.twitter.com/lNN6Pl3Lyt
— Bhuvneshwar Kumar (@BhuviOfficial) June 5, 2020