మే 30 నుంచి ఆరంభమయ్యే వన్డే ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్ బయలుదేరింది భారత క్రికెట్ జట్టు. బుధవారం తెల్లవారు జామున ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి భారత జట్టు పయనమైంది. అధికారిక దుస్తుల్లో జట్టు సభ్యులందరూ ఉన్న ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్లో పంచుకుంది. రోహిత్ శర్మ, బుమ్రా, చాహల్, హార్దిక్ పాండ్య.. కొన్ని ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
-
Jet set to go ✈✈#CWC19 #TeamIndia pic.twitter.com/k4V9UC0Zao
— BCCI (@BCCI) May 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Jet set to go ✈✈#CWC19 #TeamIndia pic.twitter.com/k4V9UC0Zao
— BCCI (@BCCI) May 21, 2019Jet set to go ✈✈#CWC19 #TeamIndia pic.twitter.com/k4V9UC0Zao
— BCCI (@BCCI) May 21, 2019
ఈ మెగాటోర్నీలో జూన్ 5న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనుంది భారత్. అంతకంటే ముందు న్యూజిలాండ్ (మే 25), బంగ్లాదేశ్ (మే 28)లతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది కోహ్లీసేన. ఇంగ్లాండ్ బయల్దేరే ముందు సారథి కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి మంగళవారం మీడియాతో మాట్లాడారు.
‘వ్యక్తిగతంగా నాకు అత్యంత సవాల్‌తో కూడుకున్న ప్రపంచకప్ ఇది. ఎవరు ఏ జట్టునైనా ఓడించవచ్చు. ఫార్మాట్ ఇంతకుముందులా లేదు కాబట్టి ప్రతి మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన చేయాల్సిందే. ఇదో భిన్నమైన సవాల్. ఎంత వేగంగా అలవాటు పడతామన్నదే కీలకం’ -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్