ETV Bharat / sports

స్పిన్​తో ఇంగ్లాండ్​ను భారత్​ ఎదుర్కోలేదు: ఆర్చర్ - ఇంగ్లాండ్

స్పిన్​తో ఇంగ్లాండ్​ను ఎదుర్కోవడం సులభం కాదన్నాడు ఆ జట్టు ఫాస్ట్​ బౌలర్ జోఫ్రా ఆర్చర్. తమ జట్టులోనూ బలమైన స్పిన్నర్లు ఉన్నారని చెప్పాడు.

India won't out-spin England, believes Archer
భారత్​.. స్పిన్​తో ఇంగ్లాండ్​ను ఎదుర్కోలేదు: ఆర్చర్
author img

By

Published : Jan 29, 2021, 6:57 PM IST

ఇంగ్లాండ్​ స్పిన్​ విభాగం పటిష్ఠంగా ఉందన్నాడు ఆ జట్టు ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్. కాబట్టి స్పిన్​ బౌలింగ్​తో తమ జట్టును ఓడించడం టీమ్​ఇండియాకు సాధ్యం కాదని చెప్పాడు.

ఇరు జట్లు త్వరలోనే నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ ఆడనున్నాయి.

" భారత్​లో పిచ్ పేసర్లకు సహకరిస్తుందని ఆశిస్తున్నా. లేదంటే కొద్దీగా బంతి తిరిగేందుకు అవకాశం ఉంటుందనుకుంటున్నా. ఒకవేళ టీమ్​ఇండియా స్పిన్​ను ఆశ్రయిస్తే ఎట్టిపరిస్థితుల్లో పోటీ ఏకపక్షంగా సాగదు. ఎందుకంటే మా దగ్గరా మంచి స్పిన్నర్లు ఉన్నారు. స్పిన్​తో భారత్ మమ్మల్ని ఢీ కొనలేదు."

-జోఫ్రా ఆర్చర్, ఇంగ్లాండ్ బౌలర్

భారత్​లో ఎన్నో ఐపీఎల్​ మ్యాచ్​లు ఆడినప్పటికీ టెస్టు అనుభవం లేదన్నాడు ఆర్చర్. ఎర్ర బంతితో ఎదురయ్యే సవాళ్లు మున్ముందు తెలుస్తాయని చెప్పాడు. ఇక టెస్టుల్లో సెషన్ల కొద్దీ బౌలింగ్​ చేయాల్సి ఉంటుందని, పిచ్​ మందకొడిగా ఉంటే బౌలర్లకు చాలా కష్టమని అన్నాడు.

ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటనలో క్లీన్​స్వీప్​తో ఉత్సాహంగా ఉంది ఇంగ్లాండ్ జట్టు. ఇక ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్​ విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉంది టీమ్​ఇండియా. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 5న చెన్నైలో ప్రారంభంకానుంది.​

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​తో​ సిరీస్​కు ముగ్గురు భారత అంపైర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.