అహ్మదాబాద్ వేదికగా భారత్తో జరుగుతున్న చివరి టెస్టులో టీ సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో ఫోక్స్ (6), లారెన్స్ (19) ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్, అక్షర్ తలో 3 వికెట్లు తీసుకున్నారు. ఇంకా 69 పరుగుల లోటుతో ఉంది రూట్ సేన.
లంచ్ అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్.. టపాటపా వికెట్లను కోల్పోయింది. ఓ దశలో 65కే 6 వికెట్లు పడిపోయాయి.
భారత్ తొలి ఇన్నింగ్స్లో 365 పరుగులకు ఆలౌటైంది.
ఇదీ చదవండి: స్విస్ ఓపెన్: సెమీస్లోకి సాత్విక్- చిరాగ్ శెట్టి జోడీ