హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా శుభారంభం చేసింది. 237పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఐదు వన్డేల సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. ఐదో వికెట్‌కు ధోని- జాదవ్ జోడి అభేద్యమైన 141 పరుగులు జోడించి విజయంలో కీలక పాత్ర పోషించారు. జాదవ్ "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్"గా నిలిచాడు.
ధోని-జాదవ్ "షో"..
విమర్శలు వచ్చిన ప్రతీసారి బ్యాట్‌తోనే సమాధానం చెప్తూ వచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. ఈ మధ్య జరిగిన టీ20లోనూ అతని ఆటతీరుపై విమర్శలొచ్చాయి. ఈ రోజు వన్డేలో ధోని ఆటపైఎంత చెప్పుకున్నా తక్కువే. నిలకడ ప్రదర్శిస్తూ అవసరమైన సమయంలో పరుగులు రాబట్టాడు. మహేంద్రుడికి తోడుగా అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు జాదవ్. ఇద్దరుతుది వరకు నిలిచి విజయం తెచ్చిపెట్టారు.
అంతకు ముందు భారత్ బ్యాటింగ్ ఆరంభించిన వెంటనే ధావన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన కోహ్లి, రోహిత్‌తో కలిసి స్కోరు బోర్డును నెమ్మదిగా పరుగులు పెట్టించాడు. రెండో వికెట్‌కు వీరిద్దరు76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ 37 పరుగులు చేయగా, సారధి కోహ్లి 44 పరుగులతో రాణించాడు. రాయుడు 13 పరుగులు మాత్రమే చేశాడు.
MS Dhoni finishes it off in style.
— BCCI (@BCCI) March 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Kedar Jadhav (81*) and MS Dhoni (59*) hit half-centuries as #TeamIndia win by 6 wickets and take a 1-0 lead in the 5 match ODI series #INDvAUS pic.twitter.com/HHA7FfEDjZ
">MS Dhoni finishes it off in style.
— BCCI (@BCCI) March 2, 2019
Kedar Jadhav (81*) and MS Dhoni (59*) hit half-centuries as #TeamIndia win by 6 wickets and take a 1-0 lead in the 5 match ODI series #INDvAUS pic.twitter.com/HHA7FfEDjZMS Dhoni finishes it off in style.
— BCCI (@BCCI) March 2, 2019
Kedar Jadhav (81*) and MS Dhoni (59*) hit half-centuries as #TeamIndia win by 6 wickets and take a 1-0 lead in the 5 match ODI series #INDvAUS pic.twitter.com/HHA7FfEDjZ
తేలిపోయిన కంగారుల బౌలింగ్..
ఆస్ట్రేలియా బౌలర్లలో కౌల్టర్ నైల్, జంపా తలో రెండు వికెట్లు తీశారు. మిగతా బౌలర్లు జేసన్, కమిన్స్, స్టాయినిస్ వికెట్లు తీసేందుకు కష్టపడ్డారు తప్ప ఫలితం దక్కలేదు. మొదట్లో వికెట్లు తీసిన బౌలర్లు ధోని-జాదవ్ జోడినిచివరి వరకు విడదీయలేకపోయారు.
ఆస్ట్రేలియా బ్యాటింగ్..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. బుమ్రా బౌలింగ్‌లో కెప్టెన్ ఫించ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఖావాజాతో కలిసిన స్టాయినిస్ రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించాడు. ఖావాజా అర్ధ శతకంతో రాణించగా స్టాయినిస్ 37 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ స్వల్ప స్కోర్లు చేసి పెవిలియన్ బాట పట్టారు.
మాక్స్వెల్ 40, క్యారీ 36 రన్స్, టర్నర్ 21, కౌల్టర్‌నైల్ 28 పరుగులు చేశారు.
భారత్ బౌలింగ్ భళా...
భారత్ బౌలర్లు సమష్టి కృషితో ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే కట్టడి చేశారు. షమి, బుమ్రా, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసి టీమిండియా విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. పార్ట్ టైమ్ స్పిన్నర్ జాదవ్ ఒక వికెట్ దక్కింది.