సిడ్నీ వేదికగా జరిగిన మహిళా టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టేశారు. బౌలింగ్ విభాగంలో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా.. 133 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఛేదనలో ఆస్ట్రేలియా జట్టు 115 పరుగులకు ఆలౌట్ అయింది.
-
#TeamIndia begin the #T20WorldCup campaign with a win over Australia 🇮🇳💪 #AUSvIND pic.twitter.com/JKcPaGUibf
— BCCI Women (@BCCIWomen) February 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#TeamIndia begin the #T20WorldCup campaign with a win over Australia 🇮🇳💪 #AUSvIND pic.twitter.com/JKcPaGUibf
— BCCI Women (@BCCIWomen) February 21, 2020#TeamIndia begin the #T20WorldCup campaign with a win over Australia 🇮🇳💪 #AUSvIND pic.twitter.com/JKcPaGUibf
— BCCI Women (@BCCIWomen) February 21, 2020
హేలీ అర్ధశతకంతో
లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టును సూపర్ ఇన్నింగ్స్‌తో ముందుకు నడిపించింది అలీసా హేలీ. అయితే మరో ఎండ్‌లోని బ్యాట్స్ఉమెన్ మూనే (6), లానింగ్ (5), హైనెస్ (6) పేలవంగా ఆడటం వల్ల ఆమెకు మద్దతు కరవైంది. అయినా హేలీ 51 (35 బంతుల్లో; 6 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకంతో రాణించి ఔటైంది. అయితే కొద్దిసేపు గార్డెనర్ 34 (36 బంతుల్లో; 3 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడింది. పెర్రీ (0), జోనస్సెన్ (2), అన్నాబెల్ (2) నిరాశపర్చారు.
తక్కువ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత అమ్మాయిల బౌలింగ్ విభాగం కీలకంగా నిలిచింది. పూనమ్ యాదవ్ 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు తీసింది. ఈ అమ్మడుకు తోడుగా శిఖా పాండే 3 వికెట్లు, రాజేశ్వరి ఒక వికెట్ ఖాతాలో వేసుకుంది. వీరికి తోడు భారత జట్టు కీపర్ తానియా భాటియా రెండు కీలక స్టంప్ ఔట్లు చేసింది.
-
A game-changing spell by @poonam_yadav24 turned this contest on its head.
— T20 World Cup (@T20WorldCup) February 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
The best figures by an overseas spinner in a women's T20I played in Australia!#T20WorldCup | #AUSvIND | #TeamIndia pic.twitter.com/kuPVFFGwXQ
">A game-changing spell by @poonam_yadav24 turned this contest on its head.
— T20 World Cup (@T20WorldCup) February 21, 2020
The best figures by an overseas spinner in a women's T20I played in Australia!#T20WorldCup | #AUSvIND | #TeamIndia pic.twitter.com/kuPVFFGwXQA game-changing spell by @poonam_yadav24 turned this contest on its head.
— T20 World Cup (@T20WorldCup) February 21, 2020
The best figures by an overseas spinner in a women's T20I played in Australia!#T20WorldCup | #AUSvIND | #TeamIndia pic.twitter.com/kuPVFFGwXQ
-
2️⃣ catches
— T20 World Cup (@T20WorldCup) February 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
2️⃣ stumpings
What a performance behind the stumps from Taniya Bhatia 👏#AUSvIND | #T20WorldCup pic.twitter.com/cH9MNDYj9Y
">2️⃣ catches
— T20 World Cup (@T20WorldCup) February 21, 2020
2️⃣ stumpings
What a performance behind the stumps from Taniya Bhatia 👏#AUSvIND | #T20WorldCup pic.twitter.com/cH9MNDYj9Y2️⃣ catches
— T20 World Cup (@T20WorldCup) February 21, 2020
2️⃣ stumpings
What a performance behind the stumps from Taniya Bhatia 👏#AUSvIND | #T20WorldCup pic.twitter.com/cH9MNDYj9Y
ఆరంభం దక్కినా
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కింది. షెఫాలి వర్మ 29 (15 బంతుల్లో; 5ఫోర్లు, 1సిక్సర్) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసింది. ఫోర్లు, సిక్సర్లతో అలరించింది. అయితే మరో ఓపెనర్ స్మృతి మంధాన 10 (10, 11 బంతుల్లో; 2ఫోర్లు) ఈ మ్యాచ్‌లో నిరాశపర్చింది. ఇద్దరూ తొలి వికెట్‌కు 41 పరుగులు చేశారు. అయితే కేవలం 6 పరుగుల వ్యవధిలో స్మృతి, షెఫాలీ, హర్మన్ ఔటయ్యారు. ఫలితంగా 47 రన్స్‌కు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది భారత్.
అర్ధశతకం మిస్సైనా
టాప్ బ్యాటర్లు ఔటైన సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన దీప్తి శర్మ... జెమిమా రోడ్రిగ్స్‌తో 26 (33 బంతుల్లో) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టారు. దూకుడుగా ఆడే క్రమంలో జెమీమా పెవిలియన్‌కు చేరినా వేదా (9*, 11 బంతుల్లో)తో కలిసి దీప్తిశర్మ పోరాడింది. ఆఖరి వరకు అజేయంగా నిలిచిన దీప్తి 49*(46 బంతుల్లో; 3×4) రాణించింది. అయితే ఆఖర్లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోవడం వల్ల భారత్ 132 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లలో జోనస్సెన్ రెండు, ఎలిసీ పెర్రీ, డెలిస్సా చెరో వికెట్ పడగొట్టారు.
-
A vital 50 stand between this pair 🤜🤛#T20WorldCup | #AUSvIND pic.twitter.com/WnKSAJgwlL
— T20 World Cup (@T20WorldCup) February 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">A vital 50 stand between this pair 🤜🤛#T20WorldCup | #AUSvIND pic.twitter.com/WnKSAJgwlL
— T20 World Cup (@T20WorldCup) February 21, 2020A vital 50 stand between this pair 🤜🤛#T20WorldCup | #AUSvIND pic.twitter.com/WnKSAJgwlL
— T20 World Cup (@T20WorldCup) February 21, 2020