స్వదేశంలో భారత జట్టులో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా లేకపోవడం ఇంగ్లాండ్కు మంచి అవకాశమన్నాడు ఆ జట్టు మాజీ సారథి మైఖేల్ వాన్. ఈ సిరీస్లో టీమ్ఇండియానే ఫేవరెట్ అంటూ గతంలో వ్యక్తం చేసిన తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తోందని చెప్పాడు.
-
Think I may need to change my series prediction ... !!! #India without @imjadeja in these conditions gives England a sniff ... Plus this England Test team are playing high quality Test cricket !!! #INDvENG
— Michael Vaughan (@MichaelVaughan) February 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Think I may need to change my series prediction ... !!! #India without @imjadeja in these conditions gives England a sniff ... Plus this England Test team are playing high quality Test cricket !!! #INDvENG
— Michael Vaughan (@MichaelVaughan) February 6, 2021Think I may need to change my series prediction ... !!! #India without @imjadeja in these conditions gives England a sniff ... Plus this England Test team are playing high quality Test cricket !!! #INDvENG
— Michael Vaughan (@MichaelVaughan) February 6, 2021
"భారత్, ఇంగ్లాండ్ సిరీస్పై నా అంచనా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సొంత గడ్డపై జడేజా లేని టీమ్ఇండియా.. ఇంగ్లాండ్కు గొప్ప అవకాశం ఇచ్చింది. దానికి తోడు పర్యటక జట్టు నాణ్యమైన టెస్టు క్రికెట్ ఆడుతోంది." అని వాన్ ట్వీట్ చేశాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో బొటన వేలు గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్నాడు జడేజా. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టులకు అతడు అందుబాటులో లేడు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.
బౌలర్ల వైఫల్యం కారణంగా తొలి టెస్టులో ఇంగ్లాండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో రూట్ ద్విశతకంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 555/8 పరుగుల వద్ద నిలిచింది.
ఇదీ చూడండి: చరిత్ర సృష్టించిన రూట్- 100వ మ్యాచ్లో 200