వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళలు ఘన విజయం సాధించారు. 53 పరుగుల తేడాతో గెలిచిన మిథాలీసేన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. వన్డేల్లో 150 విజయాల మైలురాయిని అందుకుంది. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తర్వాత నిలిచింది.
-
India secured a 53-run win over West Indies in the second women's ODI in Antigua and levelled the three-match series 1-1.#WIvIND Report ⬇️ https://t.co/qRopRJnlME
— ICC (@ICC) November 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">India secured a 53-run win over West Indies in the second women's ODI in Antigua and levelled the three-match series 1-1.#WIvIND Report ⬇️ https://t.co/qRopRJnlME
— ICC (@ICC) November 4, 2019India secured a 53-run win over West Indies in the second women's ODI in Antigua and levelled the three-match series 1-1.#WIvIND Report ⬇️ https://t.co/qRopRJnlME
— ICC (@ICC) November 4, 2019
ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 50 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియా పునియా(5), రోడ్రిగ్స్(0) ఆదిలోనే నిరాశపరిచినా.. పూనమ్ రౌత్ (77), మిథాలి రాజ్ (40), హర్మన్‌ప్రీత్ కౌర్(46) ఆదుకున్నారు. ఫలితంగా టీమిండియా నామమాత్రపు స్కోర్ చేసింది.
లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన విండీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. కెప్టెన్ క్యాంప్‌బెల్ మాత్రమే 39 పరుగులతో ఫర్వాలేదనిపించింది. చివరికి 47.2 ఓవర్లలో విండీస్ జట్టు 138 పరుగులకు ఆలౌటైంది.
భారత బౌలర్లలో రాజేశ్వరి, పూనమ్, దీప్తిశర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. పూనమ్ రౌత్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' లభించింది. తొలి వన్డేలో విండీస్ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. మూడో వన్డే (ఫైనల్ మ్యాచ్) బుధవారం జరగనుంది.